Nayanthara: లాయర్లతో నయన్ మీటింగ్స్ - కేసు నుంచి బయటపడగలరా?
నయన్ పిల్లలకు అద్దెగర్భాన్ని ఇచ్చిందెవరనే విషయంపై లోతైన విచారణ జరుగుతోంది.
నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్(Vignesh Shivan) తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సరోగసీ పద్దతిలో ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నయన సరోగసీ ద్వారా తల్లి అవ్వడం చట్ట బద్ధంగా జరిగిందా? లేదా? అనే విషయాన్ని విచారించడానికి తమిళనాడు ప్రభుత్వం ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ఇందులో భాగంగా నయన్, విఘ్నేష్ లను విచారణ చేయనున్నారు.
స్నేహితురాలి సాయంతో సరోగసీ:
నయన్ పిల్లలకు అద్దెగర్భాన్ని ఇచ్చిందెవరనే విషయంపై లోతైన విచారణ జరుగుతోంది. కేరళకు చెందిన ఓ మహిళ సరోగసీ ద్వారా బిడ్డల్ని కని.. నయనతారకు అప్పగించిందని విచారణలో తేలింది. ఆమె నయనతారకు స్నేహితురాలట. కేరళలో నయనతార తన చదువుని పూర్తి చేసింది. తనతో పాటు కలిసి చదువుకున్న స్నేహితురాలితోనే.. నయన్ కవల పిల్లలకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. సరోగసీ ద్వారా పిల్లలను పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని నయనతార అతిక్రమించిందనేది ప్రధాన ఆరోపణ.
ప్రస్తుతానికైతే.. ఈ విషయానికి సంబంధించి నయన్ దంపతులపై ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. కానీ ప్రభుత్వం సరోగసీ విధానం రూల్స్ ప్రకారం జరిగిందా..? లేదా..? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. ఒకవేళ నయన్ గనుక రూల్స్ కి వ్యతిరేకంగా సరోగసీ ద్వారా పిల్లలను పొందిందని తేలితే.. పది సంవత్సరాల జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో నయన్ కొంతమంది లాయర్లను సంప్రదిస్తోందట. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలనే విషయంపై మంతనాలు జరుపుతుందని తెలుస్తోంది.
Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?
జూన్ 9న నయన్, విఘ్నేష్ ల వివాహం జరిగింది. అప్పుడే వీరికి పిల్లలు ఎలా పుట్టారనేది చాలా మందికి అర్ధం కాలేదు. ఆ తరువాత సరోగసీ పద్ధతి ద్వారా తల్లిదండ్రులైనట్లు క్లారిటీ వచ్చింది. పెళ్లైన వెంటనే మాల్దీవులకు నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ ట్రిప్ వేశారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే హిందీలో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తున్న 'జవాన్' షూటింగులో నయనతార జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మీడియా ముందుకు పలు సార్లు వచ్చారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ రిలీజ్ 'గాడ్ ఫాదర్' షూటింగ్ చేశారు. ఆ సమయాల్లో ఎప్పుడూ ఆమె ప్రెగ్నెంట్ అనేది బయటకు రాలేదు.
మాల్దీవ్స్ తర్వాత స్పెయిన్ ట్రిప్ కూడా వేశారు నయన్ అండ్ విఘ్నేష్. ముందు మాల్దీవ్స్, ఆ తర్వాత స్పెయిన్... ఎప్పటికప్పుడు విఘ్నేష్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్కడా నయనతార గర్భంతో ఉన్నట్టు కనిపించలేదు. మరి, ఇప్పుడు పిల్లలు ఎలా పుట్టారు? అనే సందేహం సగటు సినిమా ప్రేక్షకుడిలో రావడం సహజం.
పెళ్లికి ముందు నుంచి నయనతార, విఘ్నేష్ శివన్ పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారట. సరోగసీ ద్వారా పండంటి కవలలకు జన్మ ఇచ్చారని సమాచారం. సరోగసీ ద్వారా షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, తెలుగులో లక్ష్మీ మంచు వంటి సెలబ్రిటీలు పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరారని చెప్పవచ్చు.