Kannappa Pushpa 2: 'పుష్ప రాజ్'కు పోటీగా 'కన్నప్ప' - విష్ణు మంచు టార్గెట్ అదేనా!?
Kannappa Release Date: పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. విష్ణు మంచు ఇప్పటి వరకు 'కన్నప్ప' రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఫిల్మ్ నగర్ బజ్ ప్రకారం... 'పుష్ప'కు పోటీగా వచ్చే ఛాన్స్ వుందట.
Vishnu Manchu Kannappa Tentative Release Plan: డేరింగ్ అండ్ డాషింగ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. లేటెస్టుగా వినబడుతున్న బజ్ ప్రకారం... 'పుష్ప'కు పోటీగా వచ్చే ఛాన్స్ వుందట. పూర్తి వివరాల్లోకి వెళితే...
కన్నప్ప రిలీజ్ @ డిసెంబర్!
డిసెంబర్ నెలలో 'కన్నప్ప'ను థియేటర్లలోకి తీసుకు రావాలని విష్ణు మంచు ప్లాన్ చేస్తున్నార్ట. డిసెంబర్ అంటే టాలీవుడ్ మార్కెట్, అటు పాన్ ఇండియా మార్కెట్ జనాలకు ఇప్పుడు గుర్తుకు వచ్చే ఏకైక మూవీ 'పుష్ప 2'. డిసెంబర్ 6న ఆ సినిమా రిలీజ్ కానుంది. ఎలా లేదన్నా ఆ మూవీ రన్ మూడు నాలుగు వారాలు వుంటుంది. మరి, 'పుష్పరాజ్'కు పోటీగా 'కన్నప్ప'ను తీసుకు రావాలని అనుకోవడం డేరింగ్ డెసిషన్. అలాగని, విష్ణు సినిమాను తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు.
'కన్నప్ప' కోసం విష్ణు తీవ్రంగా కష్టపడుతున్నారు. మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. న్యూజిల్యాండ్ వెళ్లి భారీ ఎత్తున షూటింగ్ చేశారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' షూట్ చేసిన లొకేషన్లలో 'కన్నప్ప'ను తీశారు. కాస్టింగ్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు.
పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అక్షయ్ కుమార్, లెజెండరీ యాక్టర్లు మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు చేశారు. కాజల్ అగర్వాల్, ప్రీతీ ముకుందన్ వంటి అందాల భామలు సైతం సినిమాలో వున్నారు. ఏ భాషకు తగ్గట్టు ఆ భాషలో స్టార్స్ సినిమాలో యాక్ట్ చేశారు. అందువల్ల, అన్ని భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ నెలకొంది. థియేటర్లలోకి ఎప్పుడు వచ్చినా సరే భారీ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పవచ్చు. అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ వుంది. 'పుష్పరాజ్'కు పోటీగా 'కన్నప్ప' రావాలంటే... విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అనుకున్న టైంలో కంప్లీట్ కావాలి.
Also Read: టీనేజ్‌లో చేసిన పనికి తీరిగ్గా ఫీలవుతోన్న బిగ్ బాస్ బ్యూటీ
పాన్ ఇండియా మూవీస్ అన్నీ రిలీజుకు రెడీ అవుతున్నాయి. ఒక్కొక్క సినిమా ఒక్కో డేట్ మీద కర్చీఫ్ వేస్తున్నాయి. జూన్ 27న రెబల్ స్టార్ 'కల్కి' వస్తుంటే... సెప్టెంబర్ 27న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర పార్ట్ 1' విడుదలకు సిద్ధమైంది. మధ్యలో లోక నాయకుడు కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఉంది. అది జూలై 12న రిలీజ్ కానుంది. యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని 'తండేల్' సినిమాను డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ... 'పుష్ప 2' డిసెంబర్ నెలలో వస్తుండటంతో గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఆ సినిమా వచ్చే అవకాశం లేదని ట్రేడ్ టాక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'గేమ్ ఛేంజర్' కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. మరి, 'కన్నప్ప' ఎప్పుడు వస్తుందో?