అన్వేషించండి

Devara: దేవర ప్రీ రిలీజ్ బిజినెస్... లాభాలు రావాలంటే ఎన్టీఆర్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని గట్టిగా కొట్టాలి

Devara Pre Release Business: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా 'దేవర' ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా జరిగింది. ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసుకోండి.

Devara Telugu States Pre Release Business: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద హైప్ బాగుంది. మొదట అక్టోబర్ 10న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినా... పవన్ కల్యాణ్ 'ఓజీ' రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో సెప్టెంబర్ 27కు వచ్చింది. ఈసారి రిలీజ్ డేట్ మారే  ఛాన్స్ లేదు. ఇది పక్కా! ప్రొడ్యూసర్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు రేటుకు సినిమా అమ్మకాలు సాగించారు. 

దేవర తెలుగు స్టేట్స్ రైట్స్ @ 125 కోట్లు!
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర: పార్ట్ 1' థియేట్రికల్ రైట్స్ అటు ఇటుగా 125 కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయట. ఒక్క ఆంధ్ర ఏరియా రూ. 50 నుంచి 55 కోట్ల రేషియోలో విక్రయిస్తున్నారు. రాయలసీమ (సీడెడ్) రైట్స్ రూ. 23 కోట్లు పలికాయని తెలిసింది. నైజాం (తెలంగాణ) రైట్స్ అంతా కలిపి రూ. 45 కోట్ల రూపాయలకు విక్రయించారు. టోటల్ తెలుగు స్టేట్స్ 'దేవర' థియేట్రికల్ రైట్స్ రూ. 125 కోట్లు అని చెప్పవచ్చు. 'దేవర' ఆంధ్ర రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, నైజాం రైట్స్ 'దిల్' రాజు తీసుకున్నారు.

బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?
Devara Break Even Target In Telugu States: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత థియేటర్లలోకి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా 'దేవర'. ఈ హీరో సినిమా వచ్చి ఆల్మోస్ట్ రెండున్నర ఏళ్ళు అవుతోంది. తమ ఫేవరేట్ హీరో మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పైగా, 'దేవర'కు ముందు పెద్ద సినిమాలు ఏవీ లేవు. జూన్ 27న ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ అవుతుంది. ఆగస్టు 15న వస్తుందని అనుకున్న 'పుష్ప: ది రూల్' రిలీజ్ డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయ్యింది. 'కల్కి' తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్లకు వచ్చే సినిమా 'దేవర' అవుతుందని, ఎన్టీఆర్ సినిమాకు అది బెనిఫిట్ అని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే... బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టాలి.

Also Read: టీనేజ్‌లో చేసిన పనికి తీరిగ్గా ఫీలవుతోన్న బిగ్ బాస్ బ్యూటీ


తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' సినిమాను 125 కోట్లకు అమ్మిన నేపథ్యంలో అటు ఇటుగా 150 కోట్ల రూపాయల షేర్ వస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒడ్డున పడే ఛాన్స్ లేదు. మూవీకి ఉన్న బజ్ చూస్తుంటే అంతకు అంత రావడం పెద్ద కష్టం కాదు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యింది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఆల్మోస్ట్ రూ. 30 కోట్లు వచ్చాయట.

'దేవర' సినిమాలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'ఫియర్' సాంగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Also Read: హనీ రోజ్ కత్తి పట్టి మనుషుల్ని వేటాడితే... గ్లామర్ కాదు, Rachel Teaserలో హనీ మాస్

టాప్ హెడ్ లైన్స్

OM Movie OTT : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
O.M Public Review : ధనుష్ 'ఓం' ట్విట్టర్ రివ్యూ : యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది?... పబ్లిక్ టాక్ ఏంటంటే?
ధనుష్ 'ఓం' ట్విట్టర్ రివ్యూ : యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది?... పబ్లిక్ టాక్ ఏంటంటే?
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Aakasamlo Oka Tara Public Review : ఆకాశంలో ఒక తార పబ్లిక్ రివ్యూ : భార్య కలను నిజం చేసిన భర్త... హార్ట్ టచింగ్ స్టోరీ... దుల్కర్ ఖాతాలో మరో హిట్?
ఆకాశంలో ఒక తార పబ్లిక్ రివ్యూ : భార్య కలను నిజం చేసిన భర్త... హార్ట్ టచింగ్ స్టోరీ... దుల్కర్ ఖాతాలో మరో హిట్?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget