అన్వేషించండి

Kiara Advani wedding: కియార అద్వానీ - సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి వేదిక ఖరారు? రిసెప్షన్ మాత్రం అక్కడేనట!

బాలీవుడ్ తారలు కియార, సిద్ధార్థ మల్హోత్ర ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు వీరి పెళ్లి గురించి ఓ లేటెస్ట్ వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. గత ఏడాది నుంచి బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ప్రేమ వ్యవహారం పై వరుసగా ఊహాగానాలు వినిస్తూనే ఉన్నాయి. కియార బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే దానిపై వీరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు వీరి పెళ్లి గురించి ఓ లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చండీగఢ్ లోనే వీరి పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులే చెప్పారంటూ వార్తలు వెలువడుతున్నాయి. 

కియార-సిద్దార్థ జంటపై ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి. మొన్నా మధ్యలో వీరిద్దరూ విడిపోయినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వీరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు అని టాక్ వినిపించింది. అయినప్పటికీ ఈ జంట ప్రైవేట్ పార్టీలలో అలాగే కొన్ని ప్రత్యేక వెకేషన్‌లలో కనిపిస్తూ ఉండడంతో ప్రేమలోనే ఉన్నారని తెలిసింది. ఇప్పుడు వీరి పెళ్లి వేదిక కూడా ఖరారు అయిందని వార్తలు వస్తున్నాయి. 

వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ముందుగా పెళ్లిని కియార ఇష్టప్రకారం గోవాలో జరింపించాలి అనుకున్నారట. కానీ ఆ తర్వాత సిద్దార్థ కుటుంబ సభ్యుల కోరిక మేరకు చండీగఢ్ కు ప్లాన్ చేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సిద్దార్థది పంజాబీ ఫ్యామిలీ కావడంతో అక్కడే వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. వీరి పెళ్లి కి చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్ విల్లాస్ స్పా రిసార్ట్ వేదిక కానుందని టాక్. ఇది సిద్ధార్థ్ కుటుంబం ఉన్న ఢిల్లీ కి కూడా సమీపంలో ఉన్నందున ఈ రిసార్ట్ ను ఎంచుకుందట ఆయన ఫ్యామిలీ. 

అలాగే పెళ్లికి వచ్చే అతిథుల జాబితాను కూడా సిద్దం చేస్తున్నారట కియార జంట. ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది దర్శకులు, నిర్మాతలతో పాటు స్నేహితుల లో కొంత మంది సన్నిహితులను కూడా పెళ్లికి ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకూ ధృవీకరించబడిన పేర్లను బట్టి చూస్తే కరణ్ జోహార్, అశ్విని యార్డి వారితో పాటు వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్, జాకీ భగ్నానితో పాటు పలువురు సెలబ్రెటీలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత కూడా అతిథుల కోసం ముంబై లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇక కియార శంకర్ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఆర్.సి 15 లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్ గా చేసింది కియార. వీరిద్దరూ జంటగా ఇది రెండో సినిమా. మరో వైపు సిద్దార్థ మల్హోత్ర నటించిన ‘యోథ’ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read Also: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget