అన్వేషించండి

Prabhas Salaar 2: షాకింగ్.. ‘సలార్ 2’ షూటింగ్ ఆగిపోయిందా? కారణం అదేనట!

Salaar 2: స‌లార్ ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో తెలిసిన విష‌య‌మే. దానికి కొన‌సాగింపుగా 'స‌లార్ - 2' వ‌స్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింద‌ట‌. దానికి ఆ ఇద్ద‌రే కార‌ణ‌మ‌ట‌.

Prabhs & Prasanth Neel's Salaar 2 Stopped: వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ప్ర‌భాస్ కి వ‌చ్చిన భారీ హిట్ 'స‌లార్'. పోయిన ఏడాది రిలీజైన ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'స‌లార్' హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్ - 2పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. దానికి సంబంధించి షూటింగ్ మొద‌ల‌వుతోంద‌ని, పార్ట్ - 1 కంటే పార్ట్ - 2 వేరే లెవెల్ లో ఉండ‌బోతున్న‌ట్లు వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు అదే 'స‌లార్ - 2'  గురించి మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

ఆగిపోయిన ప్రాజెక్ట్.. 

సౌర్యంగ ప‌ర్వ‌గా 'స‌లార్ - 2'ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. దానికి సంబంధించి డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లుపెట్టారు. ఇక ప్ర‌భాస్ 'క‌ల్కీ' సినిమా షూటింగ్ కూడా అయిపోవ‌డంతో ఈ నెలలోనే 'స‌లార్ - 2' షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని ఇండ‌స్ట్రీలో టాక్ కూడా వినిపించింది. అయితే, ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిన‌ట్లు వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. 

ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ కార‌ణ‌మా?

ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ మ‌ధ్య వ‌చ్చిన కొన్ని అభిప్రాయ బేధాల వ‌ల్లే సినిమా ఆగిపోయిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఇటు ప్ర‌భాస్ టీమ్, అటు ప్ర‌శాంత్ నీల్ టీమ్ ఎవ్వ‌రూ ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. 

వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీ.. 

ఈ సినిమా ఆగిపోవ‌డంతో ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ వాళ్ల వాళ్ల త‌ర్వాతి ప్రాజెక్ట్ ల‌లో బిజీ అయిపోయార‌ట‌. ప్ర‌భాస్.. 'స‌లార్-2' ని ప‌క్క‌న పెట్టేసి, 'రాజా సాబ్' షూటింగ్ ని ప్రారంభిస్తున్నార‌ట‌. ఇక ప్ర‌శాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో తాను చేయ‌బోయే త‌ర్వాతి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టార‌ని టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించి ఇప్ప‌టికే ప్రీ - ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్టార‌ట ఆయ‌న‌. అందుకే, వాళ్ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా షూటింగ్ ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంది అని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించిన‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్ర‌భాస్ అభిమానులు నిరాశ‌కు గుర‌వుతున్నారు. ఈ వార్త నిజం కాకూడ‌దు దేవుడా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

జూన్ 27 'క‌ల్కీ'.. 

'స‌లార్' హిట్ త‌ర్వాత మ‌రో హిట్ కోసం రెడీగా ఉన్నారు ప్ర‌భాస్. 'కల్కీ 2898 ఏడీ' తో జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటుగా దీపిక పదుకొనే , అమితాబ్‌బచ్చన్‌, దిశాపటాని త‌దిత‌రులు నటిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా సినిమాగా రిలీజ్‌ కాబోతోంది. స‌లార్ విష‌యానికొస్తే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హొంబ‌లే సినిమాని నిర్మించిన విష‌యం తెలిసిందే. 

Also Read: కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఇండియన్ నటి అనసూయ సేన్‌గుప్తా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Embed widget