Mass Jathara: రవితేజ 'మాస్ జాతర' విడుదల వాయిదా: అసలు కారణం ఇదేనా? అక్టోబర్ చివరి వరకు ఆగాల్సిందే!
Mass Jathara New Release Date: మాస్ మహారాజా రవితేజ హీరోగా నాగవంశీ నిర్మిస్తున్న 'మాస్ జాతర' సినిమాను ఆక్టోబర్ నెలాఖరుకు వాయిదా వేసినట్టు తెలిసింది. న్యూ రిలీజ్ డేట్ తెలుసుకోండి.

ఆగస్టు నెలాఖరులో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) సందడి చేయాల్సి ఉంది. ఈ నెల 27న ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'మాస్ జాతర' (Mass Jathara)ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ రోజు మూవీ రిలీజ్ కావడం లేదు. వాయిదా పడింది. మరి ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా?
ఆగస్టు నుంచి అక్టోబర్ నెలాఖరుకు?
Mass Jathara Postponed to October?: ఆగస్టు 27న 'మాస్ జాతర' విడుదల కావడం కష్టం అని కొన్ని రోజుల క్రితం క్లారిటీ వచ్చింది. సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని లీక్స్ వచ్చాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఆ తేదీన కూడా 'మాస్ జాతర' విడుదల కావడం లేదు. అక్టోబర్ 31న సినిమా రిలీజ్ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు తెలిసింది.
'వార్ 2' డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ పడిందా?
'మాస్ జాతర' వాయిదా వెనుక 'వార్ 2' రిజల్ట్ ఎఫెక్ట్ ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గాసిప్స్ వస్తున్నాయి. అయితే అసలు కారణం వేరే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2'ను నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆల్మోస్ట్ 90 కోట్లకు ఆయన రైట్స్ కొన్నారు. అందులో సగం కూడా వెనక్కి రాలేదని ట్రేడ్ టాక్. 'మాస్ జాతర' వాయిదా పడటానికి, 'వార్ 2' నష్టాలకు సంబంధం లేదని తెలిసింది.
Also Read: బెంగాల్ నేపథ్యంలో చిరు - బాబీ సినిమా... గొడ్డలి మీద ఏం రాసి ఉందో తెలుసా?
ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె జరిగింది. దాంతో 'మాస్ జాతర' షూటింగ్ ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి కాలేదు. ఒక సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఆర్టిస్టుల డేట్స్ దొరకడం కష్టం అవుతోంది. సెప్టెంబర్ నెలలో 'మిరాయ్', పవన్ కళ్యాణ్ 'ఓజీ', అక్కడ నుంచి అక్టోబర్ నెలలో 'కాంతార' వంటి సినిమాలు ఉన్నాయి. అందువల్ల అక్టోబర్ నెలాఖరుకు సినిమాను తీసుకు వెళ్లారని తెలుస్తోంది. 'మాస్ జాతర'లో రవితేజ సరసన శ్రీ లీల నటించారు. 'ధమాకా' తర్వాత వాళ్లిద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఆ మూవీకి మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ చేశారు.
'మాస్ జాతర' నుంచి టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 'తూ మేరా లవ్వర్' పాటకు దివంగత సంగీత దర్శకుడు చక్రి వాయిస్ ఏఐ ద్వారా రీ క్రియేట్ చేశారు. 'ఓలే ఓలే' అంటూ మరో పాట రిలీజ్ చేశారు. ఆ రెండూ వైరల్ అవుతున్నాయి.
Also Read: మహేష్ అన్న కొడుకు... బాలీవుడ్ హీరోయిన్ కూతురు... తెలుగు తెరకు జంటగా!





















