Jaya Krishna Ghattamaneni: మహేష్ అన్న కొడుకు... బాలీవుడ్ హీరోయిన్ కూతురు... తెలుగు తెరకు జంటగా!
Jaya Krishna Ghattamaneni Debut Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేశారట.

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరొక హీరో వస్తున్నాడు. ఘట్టమనేని కుటుంబంలో మరో కథానాయకుడు రెడీ అయ్యాడు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు తెలుసుగా! కొన్నాళ్ల క్రితం స్వర్గస్తులయ్యారు. ఆయన కుమారుడు జయకృష్ణ త్వరలో తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. అతని మొదటి సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారట.
జయకృష్ణకు జంటగా రషా తడానీ!
Rasha Thadani Debut Telugu Movie: బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గుర్తు ఉన్నారా? నటసింహం నందమూరి బాలకృష్ణ 'బంగారు బుల్లోడు', కింగ్ అక్కినేని నాగార్జున 'ఆకాశ వీధిలో', కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు 'పాండవులు పాండవులు తుమ్మెద'లో నటించారు. ఇప్పుడు ఆమె కూతురు హీరోయిన్ సినిమాల్లోకి వచ్చింది.
Also Read: 'పరదా'కు భారీ షాక్... లక్షల్లో ఓపెనింగ్ డే కలెక్షన్లు - అనుమప కష్టం వృథాయేనా?
బాలీవుడ్ ఫిల్మ్ 'ఆజాద్'తో రషా తడానీ కథానాయికగా పరిచయమైంది. జనవరిలో విడుదలైన ఆ సినిమాలో అజయ్ దేవగణ్ కుమారుడు అమన్ దేవగణ్ సరసన నటించింది. అందులో పాట వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడు రషా తడానీని తెలుగు తెరకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni)తో ఆవిడ నటించనుంది.

అజయ్ భూపతి దర్శకత్వంలో జంటగా!
జయకృష్ణను హీరోగా పరిచయం చేసే బాధ్యతను అజయ్ భూపతి తీసుకున్నారు. 'ఆర్ఎక్స్ 100'తో కార్తికేయకు మంచి హిట్ ఇచ్చారు. ఆ సినిమా ద్వారా ఆయన కథానాయికగా పరిచయం చేసిన పాయల్ రాజ్‌పుత్ ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసింది. 'మంగళవారం'తో ఆమెకు మరొక హిట్ ఇచ్చారు అజయ్ భూపతి. ఇప్పుడు జయకృష్ణ, రషా తడానీతో కొత్త సినిమా తీసేందుకు అజయ్ భూపతి రెడీ అయ్యారు. ఒక్క సినిమాతో ఇద్దరు వారసుల్ని పరిచయం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.





















