అన్వేషించండి

Ranbir Kapoor Ramayana: వామ్మో, రాముడి పాత్రకు రణబీర్ అంత డిమాండ్ చేస్తున్నాడా? అదే దారిలో సాయి పల్లవి

Ramayana: 'రామాయ‌ణ‌'.. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి దానికి సంబంధించిన ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ర‌ణ్ బీర్ క‌పూర్ రెమ్యున‌రేషన్, సాయి ప‌ల్ల‌వి రెమ్యున‌రేష‌న్ లీక్ అయ్యింది.

Ranbir Kapoor, Sai Pallavi Ramayana Remuneration: ర‌ణ్ బీర్ క‌పూర్.. 'రామాయ‌ణ' ప్రాజెక్ట్ లో రాముడిగా చేస్తున్న‌ట్లు తెలిసిందే. ఇక సాయి ప‌ల్ల‌వి సీత క్యారెక్ట‌ర్ ప్లే చేస్తుంద‌ని తెలుస్తోంది. డైరెక్ట‌ర్ నితీశ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్ట‌ర్ కాగా.. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింది. సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇక ర‌ణ్ బీర్ కపూర్ కూడా సినిమా కోసం వ‌ర్కౌట్స్ మొద‌లుపెట్టారు. దానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి సోష‌ల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఒక వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది అదే.. ర‌ణ్ బీర్ క‌పూర్, సాయి ప‌ల్ల‌వి రెమ్యున‌రేష‌న్ గురించి. మ‌రి అవి ఎంత మాత్రం నిజ‌మో. 

ర‌ణ్ బీర్ క‌పూర్ ఇన్ని కోట్లు అడిగాడా? 

'రామాయ‌ణ' ప్రాజెక్ట్ లో రాముడి పాత్ర‌లో న‌టించేందుకు ర‌ణ్ బీర్ క‌పూర్ రూ.75 కోట్లు రెమ్యున‌రేష‌న్ అడిగిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 'యానిమల్' సినిమా టైంలో ర‌ణ్ బీర్ క‌పూర్ రెమ్యున‌రేష‌న్ రూ.70 కోట్లు అని, యానిమ‌ల్ సినిమాకు మాత్రం ఆయ‌న కేవ‌లం రూ.30 నుంచి రూ.35 కోట్లు మాత్ర‌మే ఛార్జ్ చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి నేష‌న‌ల్ మీడియాలో. అలాంటిది ఆ సినిమా హిట్ త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ పాత రెమ్యున‌రేష‌న్ కంటే రూ.5కోట్లు ఎక్కువ‌గానే తీసుకున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 

సాయ పల్ల‌వికి ర‌ణ్ బీర్ కంటే ఆరురెట్లు త‌క్కువ‌.. 

ఇక సీత క్యారెక్ట‌ర్ లో న‌టిస్తున్న సాయి ప‌ల్ల‌వి మాత్రం ర‌ణ్ బీర్ క‌పూర్ కంటే ఆరు రెట్లు త‌క్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ట‌. సాయి ప‌ల్ల‌వి రూ.6 కోట్లు తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సాయిప‌ల్లవి ర‌ణ్ బీర్ క‌పూర్ కంటే త‌క్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. ఆమె ఈ సినిమాకి త‌న రెమ్యున‌రేష‌న్ డ‌బుల్ చేశార‌నే టాక్ ఫిలిమ్ న‌గ‌ర్ లో గ‌ట్టిగా వినిపిస్తోంది. ఒక్కో సినిమాకి గ‌తంలో రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తుండ‌గా.. ఇప్పుడు మాత్రం దాన్ని డబుల్ చేశార‌ట సాయి ప‌ల్ల‌వి. మ‌రి ఈ వార్త‌ల‌పై ర‌ణ్ బీర్, సాయిప‌ల్ల‌వి ఎలా స్పిందిస్తారో వేచిచూడాలి మ‌రి. 

రామాయ‌ణ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న జ‌ర‌గ‌లేదు. చిత్ర‌బృందం ఎలాంటి న్యూస్ బ‌య‌టికి చెప్ప‌లేదు. కానీ, దానికి సంబంధించి ఏదో ఒక రూమ‌ర్ వైర‌ల్ అవుతూనే ఉంటుంది. అలానే క్యారెక్ట‌ర్స్ కి సంబంధించిన వార్తలు చాలానే బ‌య‌టికి వ‌చ్చాయి. రాముడిగా ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టిస్తుండ‌గా.. సీత‌గా సాయి ప‌ల్ల‌వి నటిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆలియా భ‌ట్ ని సంప్ర‌దించ‌గా ఆమెకు డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో సాయి ప‌ల్ల‌విని ఫైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, సాయిప‌ల్ల‌వి ప్లేస్ లో జాన్వీ క‌పూర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడేమో ఆమె రెమ్యున‌రేష‌న్ పెంచేసింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక కేజీఎఫ్ స్టార్ య‌ష్ రావ‌ణుడిగా, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడిగా, బాబీ డియోల్, విజ‌య సేతుప‌తి కుంభ‌క‌ర్ణ‌, విభీష‌ణుడి పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. 

Also Read: నా బాధ చూడ‌లేక నా ఫ్రెండ్స్ అంతా అలా చేశారు, అందుకు రెండేళ్లు శ్రమించా: న‌వ‌దీప్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget