Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
Prabhas Spirit Movie: ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్‌బస్టర్ అవ్వడంతో తన తరువాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. తాజాగా తను నటించనున్న ‘స్పిరిట్’లో విలన్ ఫైనల్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Prabhas Spirit Movie Villain: ప్రస్తుతం తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లో నటిస్తున్న నటీనటులు సైతం తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు పలువురు హాలీవుడ్ యాక్టర్లను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సందీప్ రెడ్డి వంగా కూడా యాడ్ అవ్వనున్నట్టు సమాచారం. ప్రభాస్ కోసం విలన్‌గా ఏకంగా సౌత్ కొరియన్ యాక్టర్‌ను సందీప్ రంగంలోకి దించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది విన్న ఫ్యాన్స్.. ప్రభాస్ ల్యాండ్‌మార్క్ మూవీ కోసం సందీప్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.
విలన్ ఫిక్స్..
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పలు చిత్రాలు సైన్ చేశాడు. అందులో ‘కల్కి 2898 ఏడీ’ కూడా ఒకటి. దాదాపు మూడేళ్ల కష్టపడిన తర్వాత ఇటీవల జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ అందుకోవడంతో ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ పూర్తవ్వడంతో తన తరువాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ‘రాజా సాబ్’, ‘సలార్ 2’తో పాటు ‘స్పిరిట్’ కూడా లైన్‌లో ఉంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ‘స్పిరిట్’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా.. ఈ మూవీలో సౌత్ కొరియన్ యాక్టర్ విలన్‌గా నటించబోతున్నాడనే వార్త వైరల్ అయ్యింది.
కొరియన్‌లో ఫేమస్..
‘స్పిరిట్’లో ఏషియా మొత్తంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం కొరియన్ యాక్టర్‌తో పాటు కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌ను కూడా తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ముందుగా ఇందులో విలన్‌గా ‘ది ఔట్‌లాస్’, ‘ట్రైన్ టూ బూసాన్’ నటుడు మా డొంగ్-సియోక్ నటించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరెన్నో చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు మా డొంగ్-సియోక్. కొరియన్ చిత్రాలను ఫాలో అయ్యేవారికి ఈ నటుడు సుపరిచితుడు. అలాంటి నటుడు తెలుగులోకి రానున్నాడనే వార్త ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది.
పోలీస్ ఆఫీసర్‌గా..
ప్రభాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కనుంది ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్.. ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ‘యానిమల్’తో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్.. ‘స్పిరిట్’లో వైలెన్స్ మరింత భయంకరంగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్‌తో ప్రభాస్, మరోవైపు ‘యానిమల్’ సక్సెస్‌తో సందీప్ రెడ్డి వంగా.. ఇద్దరూ మంచి ఫార్మ్‌లో ఉన్నారు. దీంతో వీరి కాంబినేషన్‌లో వచ్చే ‘స్పిరిట్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read: రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కు చేరువలో ‘కల్కి 2898 ఏడీ’ - ఇప్పటివరకు ఎంత వచ్చిందో తెలుసా?