News
News
X

Chiranjeevi Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి - 'ఖుషి' నడుము సీన్ రీ క్రియేట్ చేస్తే?

తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తమ్ముడిగా తెలుగు తెరకు వచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత పవర్ స్టార్ (Power Star Pawan Kalyan) గా ఎదిగారు. చిరు తమ్ముడి ఇమేజ్ నుంచి తన కంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు. యంగ్ హీరోల్లో చాలా మంది పవన్ అభిమానులు ఉన్నారు. తాను పవన్ భక్తుడిని అని చెప్పుకోవడానికి నితిన్ ఏ మాత్రం సంకోచించరు. సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా నితిన్ కనిపించిన సన్నివేశాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది పవన్ అభిమానిగా కనిపించారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ వాడుకున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు అంటే...

పవన్ అభిమానిగా చిరు
యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించడం వేరు. ఏకంగా మెగాస్టార్ అభిమానిగా కనిపిస్తే? త్వరలో ఆ ఊహ నిజం కానుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్' (Bhola Shankar movie). మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరుది పవన్ ఫ్యాన్ రోల్ అని టాక్. 

'ఖుషి' నడుము సీన్ రీ క్రియేట్ చేస్తారా?
పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపించనున్నారని వార్తలు రావడమే ఆలస్యం. 'ఖుషి' నడుము సీన్ రీ క్రియేట్ చేస్తే ఎలా ఉంది? అనే డిస్కషన్ మొదలు అయ్యింది. సోషల్ మీడియాలో ఇప్పుడీ టాపిక్ మీద హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. మరి, ఇందులో నిజమెంత? అనేది చిరు అండ్ కో చెప్పాలి. ఈ సినిమా కోసం చిరంజీవి హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తున్నారని టాక్. 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ వీణ స్టెప్ పవన్ రీ క్రియేట్ చేశారు. 

కోల్‌కతా నేపథ్యంలో...
200 మంది డ్యాన్సర్లతో!
'భోళా శంకర్' కోసం ఇప్పుడు చిరంజీవి, సినిమాలో ఆయనకు సోదరిగా నటిస్తున్న కీర్తీ సురేష్, సురేఖా వాణి, రఘుబాబు, 'వెన్నెల' కిశోర్, 'గెటప్' శ్రీను తదితర తారాగణంపై పాటను తెరకెక్కిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ పాటలో 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 

Also Read : పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో ఓ చేంజ్ - మళ్ళీ త్రివిక్రమే!

'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెలి పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత కీర్తీ సురేష్, చిరు సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, అర్జున్ దాస్, రష్మీ గౌతమ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు.  

తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం'కు రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరు గుండుతో కనిపించవచ్చు. ఆ మధ్య సోషల్ మీడియాలో గుండు లుక్ పోస్ట్ చేసింది కూడా ఈ సినిమా టెస్టింగ్ లో భాగమే. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.

Also Read ఆస్కార్స్ - అమెరికా వెళ్ళిన రామ్ చరణ్

Published at : 21 Feb 2023 01:00 PM (IST) Tags: Pawan Kalyan khushi movie Chiranjeevi Bholaa Shankar Movie Chiru As PK Fan

సంబంధిత కథనాలు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Meena Second Marriage : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

Meena Second Marriage : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Maadhav Bhupathiraju Debut Movie : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!

Maadhav Bhupathiraju Debut Movie : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత