అన్వేషించండి

Game Changer Release Date: క్రిస్మస్ నుంచి సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' - తనయుడి కోసం చిరంజీవి త్యాగం?

Vishwambhara Release Date: తనయుడు రామ్ చరణ్ కోసం చిరంజీవి సంక్రాంతి సీజన్ త్యాగం చేయడానికి రెడీ అవుతున్నారా? 'గేమ్ ఛేంజర్', 'విశ్వంభర' సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్'. క్రిస్మస్ బరిలో విడుదల చేస్తున్నామని టాప్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు ఒకటికి రెండు సార్లు పబ్లిక్ సినిమా ఈవెంట్లలో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. కొత్తగా ఇప్పుడు ఈ సినిమా విడుదలపై అనుమానాలు మొదలు అయ్యాయి. 

క్రిస్మస్ నుంచి సంక్రాంతికి వాయిదా వేశారా?
'గేమ్ ఛేంజర్' (Game Changer Release Date) విడుదల తేదీ వెల్లడించలేదు. కానీ, అనధికారిక ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 20న థియేటర్లలోకి సినిమాను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే... అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా పడిందని గుసగుసలు వినపడుతున్నాయి. క్రిస్మస్ సీజన్ కాకుండా సంక్రాంతి బరిలో 'గేమ్ ఛేంజర్' విడుదల చేయడానికి 'దిల్' రాజు మొగ్గు చూపిస్తున్నారట. 

చరణ్ సంక్రాంతికి వస్తే చిరు వెనక్కి తగ్గక తప్పదు!
సంక్రాంతి బరి మీద కర్చీఫ్ వేసిన టాలీవుడ్ టాప్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అందరి కంటే ముందు ఉన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'విశ్వంభర' (Vishwambhara Movie). యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఆ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.

Also Read: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!

ఒకవేళ 'గేమ్ ఛేంజర్' గనుక వాయిదా పడితే... ఒక 20 రోజులు ఆలస్యంగా ఆ చిత్రాన్ని సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. అప్పుడు తనయుడి కోసం తండ్రి త్యాగం చేయక తప్పదని, 'గేమ్ ఛేంజర్' కోసం 'విశ్వంభర' సినిమా విడుదల వాయిదా వేయక తప్పదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమా? కదా? అనేది రేపు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. 'గేమ్ ఛేంజర్' రెండో సింగిల్ 'రా రా మచ్చ' లిరికల్ వీడియోలో రిలీజ్ డేట్ చెప్పే అవకాశాలు ఉన్నాయి.


'గేమ్ ఛేంజర్' వాయిదా పడితే థియేటర్లలోకి నితిన్!
'గేమ్ ఛేంజర్' గనుక వాయిదా పడితే క్రిస్మస్ సీజన్ మిస్ కాకుండా క్యాష్ చేసుకోవడం కోసం నితిన్ పేరు ఉన్న ఇద్దరు హీరోలు తమ సినిమాలను రెడీ చేస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' వంటి హీట్ తీసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'రాబిన్ హుడ్'. తొలుత క్రిస్మస్ రిలీజ్ టార్గెట్ చేస్తూ షూట్ స్టార్ట్ చేశారు. 'గేమ్ ఛేంజర్' వస్తుందని తెలిసిన తర్వాత తమ సినిమా విడుదలను హోల్డ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వాయిదా పడితే గనుక తమ సినిమాను విడుదల చేయాలని రెడీ అవుతున్నారట. నితిన్ హీరోగా 'దిల్' రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న 'తమ్ముడు'ను సైతం విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బావమరిది నార్నీ నితిన్ హీరోగా రూపొందుతున్న సూపర్ హిట్ సినిమా సీక్వెల్ 'మ్యాడ్ 2' కూడా క్రిస్మస్ రిలీజ్ డేట్ మీద కన్నేసింది.

Also Readఐఫా 2024 విన్నర్స్ లిస్ట్... చిరుకు స్పెషల్, నానికి బెస్ట్ యాక్టర్, బాలయ్యకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget