అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

GoPro Hero 12 Black: గోప్రో హీరో బ్లాక్ 12 సేల్ మొదలైపోయింది - కొత్త దాంట్లో ఏం అప్‌గ్రేడ్స్ వచ్చాయి!

గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా సేల్ ప్రారంభం అయింది. ఈ కెమెరా ధర మనదేశంలో రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది.

గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా సేల్ మనదేశంలో ప్రారంభంలో అయింది. దీనికి ముందు వెర్షన్‌తో కంపేర్ చేస్తే కంపెనీ ఇందులో చాలా మార్పులు చేసింది. ఈ కొత్త యాక్షన్ కెమెరాలో కంపెనీ జీపీ2 ప్రాసెసర్‌ అందుబాటులో ఉంది. ముందు వెర్షన్ తరహాలోనే పెద్ద 8:7 సెన్సార్‌ను కూడా ఇందులో చూడవచ్చు. గో ప్రో హీరో 12 బ్లాక్‌లో కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీని బాక్స్‌‌లో ఎండ్యురో బ్యాటరీని కూడా ఈసారి అందించారు. ఈ బ్యాటరీ ద్వారా గోప్రో హీరో 12 బ్లాక్ రెట్టింపు బ్యాటరీ బ్యాకప్ అందించనుంది.

గోప్రో హీరో 12 బ్లాక్ ధర
ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.45,000గా ఉంది. దీంతోపాటు క్రియేటర్స్ ఎడిషన్ కూడా లాంచ్ అయింది. దీన్ని కొనాలనుకుంటే రూ.65,000 పెట్టాల్సిందే. క్రియేటర్ ఎడిషన్‌లో యాక్షన్ కెమెరాతో పాటు మీడియా మోడ్, లైట్ మోడ్, వోల్టా గ్రిప్ కూడా రానున్నాయి. ఇందులో కేవలం బ్లాక్ కలర్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది.

దీనికి సంబంధించిన సేల్ ప్రముఖ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద ఇప్పటికే ప్రారంభం అయింది. గో ప్రో హీరో 11 బ్లాక్ ధరను కూడా మనదేశంలో తగ్గించారు. ప్రస్తుతం మనదేశంలో ఇది రూ.40,999కే అందుబాటులో ఉంది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

గోప్రో హీరో 12 స్పెసిఫికేషన్లు
గోప్రో హీరో 12 కొత్త మోడల్ చూడటానికి ముందు వెర్షన్ తరహాలోనే ఉంది. కానీ కొన్ని మార్పులు అయితే చేశారు. 5.3కే, 4కే రిజల్యూషన్‌లో షూట్ చేసే వీడియోలకు హెచ్‌డీఆర్ సపోర్ట్‌ను గోప్రో తీసుకువచ్చింది. ఇందులో కొత్త వర్టికల్ క్యాప్చర్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా 9:16 యాస్పెక్ట్ రేషియోలో వీడియోలు రికార్డు చేసే అవకాశం ఉంటుంది. టైమ్‌ ర్యాప్, టైమ్‌ ల్యాప్స్, నైట్ ఎఫెక్ట్స్, నైట్ ల్యాప్స్ వంటి ఫీచర్లు కూడా గోప్రో హీరో 12 8:7 మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆటోబూస్ట్ ఉన్న హైపర్‌స్మూత్ 6.0 ఫీచర్ కూడా గోప్రో హీరో 12లో ఉంది. దీని ద్వారా మరింత స్టెబిలైజేషన్ కూడా లభించనుంది. అలాగే నాలుగు రెట్లు ఎక్కువ డేటాను ఈ కొత్త మోడల్ అందించనుందని కంపెనీ తెలిపింది. మీరు గోప్రోలో ఫొటోలు దిగాలనుకుంటే ఇంటర్వల్ ఫొటో అనే ఫీచర్ కూడా అందించారు. ఈ ఫీచర్ ద్వారా 0.5 సెకన్ల నుంచి 120 సెకన్ల వరకు టైమర్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.

వైర్‌లెస్ ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువస్తుంది. వినియోగదారులు తమ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుని ఆడియో కూడా రికార్డు చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్లను కూడా వైర్‌లెస్‌గా వినవచ్చు. గోప్రో హీరో 12 బ్లాక్‌కు ఒకేసారి నాలుగు బ్లూటూత్ డివైస్‌లు కనెక్ట్ చేసే అవకాశం ఉంది.

ఈ కొత్త గోప్రో హీరో 12 బ్లాక్‌లో జీపీ2 ప్రాసెసర్‌ను అందించారు. 8:7 యాస్పెక్ట్ రేషియో ఉన్న 1/1.9 అంగుళాల సెన్సార్ కూడా అందించారు. ఈ కెమెరాకు 2.27 అంగుళాల టచ్ డిస్‌ప్లేను కూడా అటాచ్ చేశారు. వెనకవైపు టచ్ ఫీచర్ లేని 1.4 అంగుళాల డిస్‌ప్లే ఉంది. కేస్ లేకుండానే 10 మీటర్లు లేదా 33 అడుగుల లోతు వరకు వాటర్ ప్రూఫ్ రేటింగ్‌ను గోప్రో హీరో 12 పొందింది. ఈ యాక్షన్ కెమెరాలో 1720 ఎంఏహెచ్ ఎండ్యురో బ్యాటరీని కూడా అందించారు. ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే రెండు రెట్లు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను గోప్రో 12 ద్వారా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ - లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget