Good News to Prabhas Fans : ఆహా - ఈ రోజే బాహుబలితో బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్, టైమింగ్ తెలుసా?
నట సింహం నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కి మన 'బాహుబలి' ప్రభాస్, అతనితో పాటు స్నేహితుడు గోపీచంద్ వచ్చారు. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా స్ట్రీమింగ్ కానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఓ శుభవార్త. అలాగే, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు కూడా! ఈ ఇద్దరి కాంబినేషన్ చూడాలని ఎదురు చూస్తున్న వీక్షకులకు కూడా! వాళ్ళు రేపటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
రాత్రి 9 గంటల నుంచి షురూ!
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'ఆహా' ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'కి ప్రబస్ వచ్చారు కదా! దానిని రెండు ఎపిసోడ్స్ కింద విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. (Unstoppable 2 with NBK - The Beginning on 29th December) తొలుత 'బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1ను డిసెంబర్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క రోజు ముందుకు వచ్చారు.
''డార్లింగ్ ఫ్యాన్స్... మీ కోరిక మేరకు, మన 'బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1 ఈ రోజే రిలీజ్ చేస్తున్నాం. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కొంచెం ముందు స్టార్ట్ చేద్దాం. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది'' అని 'ఆహా' ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ పార్ట్ 1 కోసం ఓ స్పెషల్ ప్రోమో విడుదల చేశారు. అందులో రామ్ చరణ్ ఫోన్ చేసినప్పుడు ''ముందు నా సినిమా చూడు, తర్వాత మీ నాన్నగారి సినిమా చూడు'' అని బాలకృష్ణ చెప్పడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ప్రభాస్, గోపీచంద్ (Gopichand) అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని 'ఆహా' వర్గాలు పేర్కొన్నాయి. రెండు గంటలకు 20 నిమిషాలు తక్కువ అన్నమాట. దీనిని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్టుకు 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే - ది బిగినింగ్' అని పేరు పెట్టారు.
Also Read : పెద్దరికం అనుభవించాలని లేదు - సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి
View this post on Instagram
జనవరి 6న రెండో పార్ట్!
Unstoppable 2 with NBK - The Conclusion on 6th January : రెండో పార్టుకు 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే - ది కన్‌క్లూజన్' అని పేరు పెట్టారు. ఇందులో ప్రభాస్ సహా గోపీచంద్ కూడా సందడి చేయనున్నారు. ఈ పార్ట్ జనవరి 6న విడుదల చేయనున్నారు.
మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే... అందులో ప్రభాస్ (Prabhas) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన ఓ ఇంటివాడు అయితే? అమ్మాయితో ఏడు అడుగులు వేస్తే? చూడాలని చాలా మంది ఆశ పడుతున్నారు. 'అన్‌స్టాపబుల్ 2'లో ఆ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారని ఆల్రెడీ విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ప్రభాస్ మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోనున్నారని బాలకృష్ణతో 'అన్‌స్టాపబుల్ 2'లో రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తప్పకుండా ప్రభాస్ పెళ్లి ఉంటుందని గోపీచంద్ కూడా చెప్పారట. ఆ విషయాలు అన్నీ రెండో పార్టులో ఉంటాయట.
Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో చరిత్రలో ఓ ఎపిసోడ్‌ను రెండుగా వీక్షకుల ముందుకు తీసుకు వస్తుండటం ఇదే మొదటిసారి. ''మాకు అభిమానుల నుంచి లెక్కలేనన్ని మెసేజెస్ వచ్చాయి. ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయాలని కోరారు. ప్రభాస్ ఎపిసోడ్ ఫైనల్ కట్ విషయంలో ఆహా టీమ్ చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్, నందమూరి బాలకృష్ణ, ఆహా టీమ్ అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్‌ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యాము'' అని 'ఆహా' వర్గాలు తెలిపాయి.