By: ABP Desam | Updated at : 29 Jan 2022 03:16 PM (IST)
గొల్లపూడి మారుతీరావు సతీమణి కన్నుమూత..
దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు(Goallapudi Maruti rao) భార్య శివకామసుందరి(81) శుక్రవారం నాడు కన్నుమూశారు. చెన్నైలోని టి.నగర్‌లోని శారదాంబాళ్ వీధిలో నివాసముంటున్న ఆమె తన స్వగృహంలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శివకామసుందరి భౌతికాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో శుక్రవారమే అంత్యక్రియలను నిర్వహించినట్లు తెలుస్తోంది. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించి సమాచారం.
రామభక్తురాలైన శివకామ సుందరి.. మూడున్నర కోట్ల 'రామకోటి' రాసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2019 డిసెంబర్ లో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూసి సంగతి తెలిసిందే. అప్పటినుంచి శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావుతో కలిసి ఉంటున్నారు.
1961లో మారుతీరావుకి, శివకామ సుందరితో వివాహం జరిగింది. పెళ్లి తరువాత ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించి ఆంధ్రప్రభ దినపత్రికలో ఉపసంచాలకునిగా ఉద్యోగం సంపాదించారు. ఆ తరువాత చిత్తూరులో ఆంధ్రప్రభ మరో ఎడిషన్ మొదలుపెట్టినప్పుడు అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు గొల్లపూడి.
ఆ తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం రావడం.. హైదరాబాద్ కు వచ్చారు. దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేసి.. అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తర్వాత 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు దక్కింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన సతీమణి శివకామ సుందరితో సమయం గడపడానికి ఇష్టపడేవారు.
మాటల రచయితగా 'ఆలయశిఖరం' సినిమాతో మారుతీరావుకి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. సినిమా అవకాశాలు కూడా పెరగడంతో ఆయన భోజనం చేసే తీరిక కూడా ఉండేది కాదట. ఆ సమయంలో తన భార్య చిన్నపిల్లాడిలా తన్నాడు చూసుకుందని కొన్ని సందర్భాల్లో చెప్పారు మారుతీరావు. ఉత్తమ కథా రచయితగా, నటుడిగా పలు కేటగిరిటీల్లో నంది అవార్డులు అందుకున్నారాయన. దీనంతటికీ కారణం తన భార్యే అని చెబుతుంటారాయన. ఇప్పుడు ఆమె కన్నుమూయడం బాధాకరం. ఈ విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకి సంతాపం తెలుపుతున్నారు.
గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతలుకు ముగ్గురు కుమారులు. పెద్దవాళ్లు ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి చూపనప్పటికీ.. చిన్నవాడైన శ్రీనివాస్ మాత్రం రచయితగా రాణిస్తూ అప్పట్లో దిగ్గజ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. దర్శకుడు కావాల్సిన ఆయన షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే కన్నుమూయడం మారుతీరావు కుటుంబంలో పెద్ద విషాదాన్ని మిగిల్చింది. అజిత్ హీరోగా 'ప్రేమ పుస్తకం' సినిమాను మొదలుపెట్టిన మారుతీరావు కొడుకు వైజాగ్ బీచ్ లో షూట్ చేస్తుండగా.. పెద్ద అల రావడంతో అందులో కొట్టుకొనిపోయారు. కొడుకు మరణంతో ఆగిపోయిన సినిమాను గొల్లపూడి తన డైరెక్షన్ లో పూర్తి చేశారు. కొడుకు పేరుతో ఫౌండేషన్ ని స్థాపించి ఇండియాలోని ప్రముఖ నటులకు ప్రతిభా పురస్కారాలను అందించారు.
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Nikhat Zareen Profile: ఓవర్నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్ది 12 ఏళ్ల శ్రమ!
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు