News
News
X

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘గాడ్ ఫాదర్’. అక్టోబర్ 5న విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

FOLLOW US: 

చిరంజీవి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ‘గాడ్ ఫాదర్‌’ ట్రైలర్‌  విడుదల అయ్యింది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ అదిరిపోయింది.   ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో భాగంగా సినిమా యూనిట్ ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. చిరంజీవి యాక్షన్‌, అదిరిపోయే డైలాల్స్,  బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచాయి. చిరంజీవి న్యూ లుక్ లో వారెవ్వా అనిపించారు. లూసీఫర్ సినిమాను పూర్తిగా మార్చి తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఈ సినిమాను రూపొందించారు. నయనతార, సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్‌, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్‌ కీలక పాత్రలు పోషించిన ‘గాడ్‌ ఫాదర్‌’ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరెక్కిన లేటెస్ట్ సినిమా 'గాడ్ ఫాదర్'. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

News Reels

అటు ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'గాడ్ ఫాదర్'.. 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందిందని చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా తెలిపారు. సినిమాను చూసిన సెన్సార్ స‌భ్యులు అభినందించార‌ని, ఇక ప్రేక్ష‌కులు త‌మ ఆశీస్సులు అందించ‌ట‌మే మిగిలింద‌ని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.

అటు 'గాడ్ ఫాదర్'లో క్లైమాక్స్ ఫైట్ / సీన్ సుమారు 15 నిమిషాలు ఉంటుందని తెలిసింది. అందులో చిరంజీవి, సల్మాన్... ఇద్దరూ కనిపిస్తారు. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'కి ఇది రీమేక్ అన్నది తెలిసిందే. అయితే, ఆ సినిమాతో పోలిస్తే... 'గాడ్ ఫాదర్'లో కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. అందులో క్లైమాక్స్ ఫైట్ ఒకటి. 'లూసిఫర్'లో ఉన్నది ఉన్నట్లు తీయకుండా... కొత్తగా ట్రై చేశారట. కథలో ఆత్మ మిస్ కాకుండా ఆడియన్స్‌కు 'హై' ఇచ్చేలా డిజైన్ చేశారట. క్లైమాక్స్‌ను చిరు, సల్మాన్ ఇమేజ్‌కు తగ్గట్టు తీశారట. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే కాదు... 'లూసిఫర్' కథలోనూ కొన్ని మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' తెరకెక్కించారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారట. అదీ అసలు కథకు ఏమాత్రం అడ్డు పడకుండా చేశారట.

కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.

Published at : 28 Sep 2022 08:29 PM (IST) Tags: chiranjeevi nayanthara salman khan Satyadev Thaman god father movie Godfather trailer

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు