అన్వేషించండి

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

గాడ్ ఫాదర్ మూవీ టీం చిరంజీవికి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఈ నెల 22 ఆయన పుట్టిన రోజు జరుపుకోబోతుండగా.. ఒకరోజు ముందుగానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయబోతుంది..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ కీలక ప్రకటన చేసింది. చిరు బర్త్ డే కానుకగా టీజర్ రిలీజ్ అవుతుంది. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. మలయాళ సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘లూసిఫర్’ సినిమాకు రీమేక్ గా.. ఈ సినిమా తెలుగులో తెరకెక్కుతుంది. మలయాళంలో మోహన్ లాల్ నటనకు అక్కడి జనాలు నీరాజనాలు పట్టారు. అద్భుత విజయాన్ని అదించారు. అదే హిట్ సినిమాను.. దర్శకుడు మోహన్ రాజా తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా చిత్రీకరిస్తున్నారు.   

గాడ్ ఫాదర్ కుసంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ కాగా.. తాజాగా అదిరిపోయే విషయాన్ని వెల్లడించింది మూవీ యూనిట్. ఈ నెల 21 గాడ్ ఫాదర్ టీజర్ రిలీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరుసటి రోజు చిరంజీవి బర్త్ డే కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారట. ఇందులో సల్లూ భాయ్ కోసం దర్శకుడు పవర్ ఫుల్ క్యారెక్టర్ ను రూపొందించారట.

చిరంజీవి, సల్మాన్ ఖాన్ మీద చిత్రీకరించిన సీన్లు సినిమాకే హైలెట్ గా ఉంటాయని సినిమా పరిశ్రమలో టాక్ నడుస్తుంది. తెలుగు సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం.. అదీ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో చేయడంతో అంచనాలు ఓ రేంజిలో ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సల్మాన్, చిరు మధ్యలో వచ్చే ప్రతి సీన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా నయనతార నటిస్తున్నారు.

మలయాళంలో  సూపర్‌ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’  సూపర్ సక్సెస్ సాధించింది.  పృథ్వీరాజ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో చిరంజీవి కాస్త నెరిసిన జట్టు, నల్లటి దుస్తుల్లో మాస్ లుక్ లో కనిపించారు. సునీల్ కారు డోర్ తీయగానే చిరంజీవి దిగి వచ్చే సీన్ అదుర్స్ అనిపించింది. ఆయన లుక్  తో పాటు  అదిరిపోయేలా వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఆకట్టుకుంది.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు. చిరంజీవి ఈ నెల 22న తన 67వ బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించి  బ్లాక్ బస్టర్ మూవీ ‘ఘరానా మొగుడు’ను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.  

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Konidela Production Company (@konidelapro)

Also Read: ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?

Also Read: రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget