News
News
X

God Father First Single: తమన్ మళ్లీ కాపీ కొట్టేశావా? ‘గాడ్ ఫాదర్’ ట్యూన్ పై నెటిజన్ల ట్రోల్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొనసాగుతున్నాడు తమన్. వరుసబెట్టి సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. తాజాగా ఆయన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

FOLLOW US: 

టాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ హవా కొనసాగిస్తున్నాడు. తెలుగులో తోపు హీరోలందరి సినిమాలకు ఆయనే మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగు ఒక్కటే కాదు.. సౌత్ లోని పలు సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నాడు. ఒకే ఏడాది పది సినిమాలకు సంగీతం అందిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఆయన సంగీతం అందించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా వైకుంఠపురములో సినిమాకు అందించిన సంగీతానికి గాను  తాజాగా జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నాడు.   

అయితే తమన్ ఏ సినిమాకు మ్యూజిక్ చేసినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం కామన్ అయ్యింది.  కొన్ని సార్లు ఆయన పాటలను ఆయనే కాపీ చేసుకుంటూ విమర్శల పాలవుతున్నారు.  ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ పేరుతో మ మ మహేషా అంటూ సాగుతున్న ఆ సాంగ్ మీద కాపీ ఆరోపణలు వచ్చాయి.   

తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా పాట విషయంలోనూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.  ఈ సినిమా సాంగ్‌ మ్యూజిక్ నూ తమన్ కాపీ కొట్టాడంటూ జోరుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘తార్ మార్ తక్కర్ మార్’  అనే ఫస్ట్ సింగిల్  విడుదల చేశారు. ఈ ట్యూన్ విన్న ప్రేక్షకులు తమన్ మళ్లీ కాపీ కొట్టాడంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు.  క్రాక్ సినిమాలో ఓ పాటకు థమన్ ఇచ్చిన ట్యూన్ ను మళ్లీ ‘గాడ్ ఫాదర్’ కోసం వాడేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు  ‘తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌’ పాట  రవితేజ క్రాక్‌ చిత్రంలోని ‘డండనకర నకర.. నకర’ పాటలాగే ఉందంటున్నారు.

అటు చిన్న పిల్లల రెయిమ్స్ ‘తార్ మార్ తక్కర్ మార్’ నుంచి కాపీ కొట్టారేమోనని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. తమన్‌ నువ్వు ఇక మరావా? అంటూ మండిపడుతున్నారు.  చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలకు పని చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ట్యూన్లు కాపీ కొట్టి దొరికపోవడం తమన్‌ కు ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా పలు పాటలకు కాపీ కొట్టి పట్టుబడ్డాడు. నెటిజన్లు నుంచి ఘోరంగా ట్రోల్‌ చేశారు కూడా. మెగాస్టార్ సినిమా ట్యూన్స్ పై తమన్  ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అటు తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. పూర్తి పాట సెప్టెంబర్ 15న విడుదల  కానుంది.

Published at : 15 Sep 2022 07:46 PM (IST) Tags: Thaman god father movie Netizens trolling God Father First Single

సంబంధిత కథనాలు

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం, సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం,  సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!