Gangs of Godavari First Single: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి సాలిడ్ అప్ డేట్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య కాంబోలో వస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మాస్ హీరో విశ్వక్ సేన్ వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నారు. ఆయన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ మంచి సక్సెస్ అందుకుంది. యాక్షన్ డ్రామా రూపొందిన ఈ సినిమా అభిమానులను ఓ రేంజిలో అలరించింది. ఈ సినిమాను విశ్వక్ స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం సితార బ్యానర్ లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
రేపే(ఆగష్టు 16) ఫస్ట్ సింగిల్ విడుదల
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకోగా, తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ ఓ చోట కూర్చొని సిగరెట్ కాల్చుతుండగా, హీరోయిన్ నేహా కారులో వచ్చి తనను చూస్తుంది. ఆమెను చూడగానే సిగరెట్ పడేస్తాడు హీరో. అది చూసి హీరోయిన్ నవ్వుతుంది. ‘చుట్టంలా చూసి’ అంటూ కొనసాగే ఈ ఫస్ట్ సింగిల్ రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చక్కటి విజువలైజేషన్ తో ఈ ఫస్ట్ సింగిల్ అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. విశ్వక్సేన్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టారు. ఆయన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఆకట్టుకున్నాయి.
యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీ మొత్తం గోదావరి జిల్లా చుట్టూనే తిరగనుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ చాలా వరకు ఉభయ గోదావరి జిల్లాలోనే జరిగినట్లు తెలుస్తోంది. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. తెలుగు అమ్మాయి అంజలి కీలక పాత్రలో మెరువబోతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుస సినిమాలతో జోరుమీదున్న విశ్వక్
ఇక విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ ‘దాస్ కా ధమ్కీ’, ‘ఓరి దేవుడా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే రాణించాయి. ప్రేక్షకులను ఈ చిత్రాలు బాగా ఆకట్టుకోవడంతో పాటు వసూళ్ల పరంగానూ ఫర్వాలేదు అనిపించాయి. ప్రస్తుతం కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. అటు విశ్వక్ సేన్ తో కలిసి రవితేజ ముళ్ళపూడి ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించబోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఓకే అయ్యింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తంగా వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు మాస్ హీరో విశ్వక్ సేన్.
Read Also: పవన్‌పై చంద్రబాబు సెటైర్లు - ‘వ్యూహం’ టీజర్ 2లో ఎవర్నీ వదలని ఆర్జీవీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial