అన్వేషించండి

2024 Tollywood Big Movies: 2024 మొదటి సగంలో ఐదు భారీ సినిమాలు - దేశాన్ని శాసించే దిశగా టాలీవుడ్!

2024 మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా ఐదు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో ప్రతి సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు పైమాటే.

టాలీవుడ్ లెక్కలు మారుతున్నాయి. ఒకప్పుడు సినిమా షూటింగ్ సగం అయ్యాకనో, లేకపోతే చివరికి వచ్చాకనో ప్రమోషన్, విడుదల తేదీ గురించిన చర్చలు ప్రారంభించేవాళ్లు. కానీ ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా మేనియా ఈ ట్రెండ్‌ను మార్చేసింది. సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే విడుదల తేదీ, ఏ సీజన్‌లో రిలీజ్ చేస్తే బడ్జెట్ వర్కవుట్ అవుతుంది, ఇలాంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి.

ఎందుకంటే ఒక సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు సెట్ అయ్యే డేట్‌ను పట్టుకోవడం అంత సులభం కాదు. ఆ సమయానికి ఇతర భాషల్లోని పెద్ద సినిమాలతో పోటీ పడకూడదు. ఈ విషయంలో క్లారిటీ ఉండటానికే చాలా సినిమాలు ముందుగానే విడుదల తేదీని ప్రకటించి క్లాష్ రాకుండా చేయడానికి కర్చీఫ్‌లు వేస్తున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ మరింత అడ్వాన్స్ అయింది. 2023 వేసవి కాదు, 2024 ప్రథమార్థం కూడా పెద్ద సినిమాలతో ఫుల్ అయింది. ప్రస్తుతం అనుకున్న లెక్కల ప్రకారం జరిగితే వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో ప్రస్తుతం తెలుగులో ఉన్న ఆరుగురు స్టార్ హీరోల నుంచి కనీసం నాలుగు లేదా ఐదు సినిమాలు విడుదల కావచ్చు. వీటన్నిటి బడ్జెట్ కనీసం రూ.200 కోట్ల పైనే ఉంటుంది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

1. ఎన్టీఆర్30
2024లో మొదటగా కర్చీఫ్ వేసి డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ సినిమానే. ఇంకా కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. కానీ 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆచార్య విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమా కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇటీవలే అప్‌డేట్ ఇచ్చారు. అంటే ఏడు నెలల ప్రీ-ప్రొడక్షన్, 13 నెలల పాటు మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ జరగనున్నాయన్న మాట. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇంత టైమ్ ‘ఆర్ఆర్ఆర్’కు మినహా ఏ సినిమాకూ ఇవ్వలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ సినిమాకు అనిరుథ్ తీసుకుంటున్నట్లు సమాచారం.

2. రామ్‌చరణ్, శంకర్‌ల సినిమా (RC15)
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2023 ప్రథమార్థంలోనే విడుదల కావాల్సింది. కానీ కోలీవుడ్‌లో ‘విక్రమ్’ సినిమా సూపర్ హిట్ కావడం ఈ సినిమాకు అడ్డుపుల్ల వేసింది. దానికి, దీనికి ఏంటి సంబంధం అంటారా? రామ్‌చరణ్ సినిమా కంటే ముందు  శంకర్ ‘భారతీయుడు-2’కు కమిట్ అయ్యారు. అప్పుడు కమల్ హాసన్ మార్కెట్ డౌన్‌లో ఉండటంతో ఈ సినిమాకు లైకా రూ.180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. సగం సినిమా కూడా పూర్తి కాకముందే శంకర్ ఆ బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేయడంతో అప్పటికి మార్కెట్ లేని కమల్‌పై మరింత ఇన్వెస్ట్ చేయడానికి లైకా ముందుకు రాలేదు. దీంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. శంకర్ కూడా రామ్‌చరణ్‌తో సినిమా ప్రారంభించి ఆ సినిమాలో బిజీ అయ్యారు.

కానీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ రూ.450 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో కమల్‌పై భారీ బడ్జెట్ వర్కవుట్ అవుతుందని లైకాకు నమ్మకం వచ్చింది. దీనికి తోడు వారికి తమిళనాట ప్రభుత్వ సపోర్ట్ కూడా దొరికింది. ప్రస్తుతం మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జెయింట్ బ్యానర్‌ను కూడా ‘భారతీయుడు-2’ నిర్మాణంలో భాగస్వామిని చేశాడు. దీంతో శంకర్ మళ్లీ భారతీయుడు-2పై వర్క్ చేయాల్సి వచ్చింది. నెలలో భారతీయుడు-2, రామ్‌చరణ్ సినిమాకు చెరో 12 రోజుల వర్క్ జరుగుతుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఒకవేళ భారతీయుడు-2 పూర్తయినా, దాని పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనులు ఉండనే ఉంటాయి. దీంతో రామ్ చరణ్ సినిమాకు శంకర్ ఎంత టైం ఇవ్వగలడో తెలియడం లేదు. కాబట్టి ఈ సినిమాను 2024 సంక్రాంతికి వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

3. ఆదిపురుష్/ప్రభాస్ - మారుతి సినిమా
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నన్ని సినిమాలు భారతదేశంలో ఏ హీరో చేతిలోనూ లేవు. గత దశాబ్దకాలంలో చూసుకుంటే ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ మీదున్న ఏకైక హీరో ప్రభాసేనేమో. అన్నీ సవ్యంగా జరిగుంటే ‘ఆదిపురుష్’ ఈ సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ టీజర్ బ్యాక్ ఫైర్ అవ్వడంతో వీఎఫ్ఎక్స్‌పై మళ్లీ వర్క్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. దీంతో 2023 జూన్ 16వ తేదీకి ‘ఆదిపురుష్’ను వాయిదా వేశారు. కానీ సినిమా మొత్తానికి వీఎఫ్ఎక్స్ మళ్లీ చేయాలని, దానికి చేతిలో ఉన్న ఆరు నెలల సమయం అస్సలు సరిపోదని తెలుస్తోంది. మరో ఆరు నెలలు వాయిదా వేసి 2024 ప్రథమార్థంలో ఆదిపురుష్‌ను తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ ఆదిపురుష్ సమయానికి వచ్చేసినా, ప్రభాస్ - మారుతిల సినిమా కూడా 2024 సంక్రాంతి టార్గెట్‌గా రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి 2024 ప్రథమార్థంలో ఈ రెండు సినిమాల్లో ఒకటి కచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

4. పుష్ప-2
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప-2 ఒకటి. దీంతో నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే పుష్ప-2 కూడా విడుదల అయి ఉండాలి. కానీ స్క్రిప్టు ఆలస్యం కావడంతో ఇంతవరకు పూర్తి స్థాయిలో షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. బన్నీ కూడా ఈ సినిమాపై ఎంతో కేర్ తీసుకుంటున్నాడని సమాచారం. హడావుడిగా వెళ్లకూడదని, ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ ఈ సినిమా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట. మన లెక్కల మాస్టారు సుకుమార్ మామూలుగానే పర్‌ఫెక్షనిస్టు. ఇంక ఇన్ని అంచనాలు ఉన్న ప్రాజెక్టును ఎలా చెక్కుతాడో చెప్పేదేం ఉంది. ఈ లెక్కన పుష్ప-2 కూడా ఈ సంవత్సరం కాకుండా 2024 ప్రథమార్థంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

5. ప్రాజెక్ట్ - కే
ఈరోజుకు దేశంలో సెట్స్‌పై ఉన్న అన్ని సినిమాల్లో ఖరీదైన సినిమా ఇదే. దాదాపు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. 2024 సమ్మర్‌లో ఈ సినిమాను తీసుకురావాలన్నది నిర్మాతల ఆలోచన. సరిగ్గా చెప్పాలంటే మే 9వ తేదీ వైజయంతి మూవీస్‌కు ఎంతో అచ్చొచ్చిన తేదీ. అశ్వనీదత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి లాంటి మెమరబుల్ సినిమాలతో పాటు మహర్షి వంటి కమర్షియల్ హిట్లు కూడా అదే రోజున విడుదల అయ్యాయి. ఈ తేదీన ‘ప్రాజెక్ట్-కే’ను విడుదల చేయాలని తాను భావిస్తున్నట్లు అశ్వనీదత్ ఈ మధ్య ఒక టీవీ షోలో తెలిపారు. ఇప్పటికే 65 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ సినిమా కూడా 2024 ప్రథమార్థంలోనే విడుదల కానుంది.

ఈ రేసులో నుంచి కొన్ని సినిమాలు తప్పుకునే, మరికొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తానికి 2023లో ఎంత మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదో తెలీదు కానీ, 2024లో మాత్రం పెద్ద హీరోల సినిమాలు ఒక రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget