Lokesh Kanagaraj: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ నిర్ణయం, ఇక సినిమాలకు వీడ్కోలు?
యంగ్ అండ్ టాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 10 సినిమాలు తీసిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.
![Lokesh Kanagaraj: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ నిర్ణయం, ఇక సినిమాలకు వీడ్కోలు? Filmmaker Lokesh Kanagaraj Announces Plans to Retire from Movies after 10 Films Lokesh Kanagaraj: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ నిర్ణయం, ఇక సినిమాలకు వీడ్కోలు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/20/a24e6790b1fb4592d73b300ceca2eb281687244480959544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తమిళ నాట టాప్ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు లోకేష్ కనగరాజ్. విలక్షణ కథలతో సినిమాలను తెరకెక్కించే ఆయన, ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో దళపతి విజయ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ గా త్రిష కృష్ణన్ యాక్ట్ చేస్తోంది.
10 సినిమాల తర్వాత ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ గుడ్ బై
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్, తన సినీ కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచన లేదని వెల్లడించారు. కేవలం 10 సినిమాలు కంప్లీట్ అయ్యాక ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. “ నా కెరీర్‌లో మరిన్ని సినిమాలు చేసే ఆలోచన లేదు. కేవలం 10 సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. 10 పూర్తి కాగానే ఫిల్మ్ మేకింగ్ నుంచి సెలవు తీసుకోవాలి అనుకుంటున్నాను” అని తెలిపారు. అంటే మరో రెండు, మూడు సినిమాల తర్వాత లోకేష్ సినిమాలకు ఫుల్ స్టాఫ్ పెట్టే అవకాశం ఉంది.
లోకేష్ నిర్ణయం పట్ల తమిళ సినీ పరిశ్రమ షాక్
లోకేష్ కనగరాజ్ నిర్ణయం పట్ల తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. నిర్ణయం మంచిదే అయినా, ఆయన లాంటి టాలెంటెడ్ దర్శకుడు ఇండస్ట్రీలో ఉండటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కోలీవుడ్ క్వెంటిన్ టరాన్టినోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మరోసారి తన నిర్ణయాన్ని సమీక్షించుకుంటే మంచిదని నెటిజన్లు అంటున్నారు. మరికొంత మంది మాత్రం ఆయన నిర్ణయం సరైనది కాదని చెప్తున్నారు. లోకేష్ కనగరాజ్ లాంటి ఫిల్మ్ మేకర్స్ వల్ల ఇండస్ట్రీకి మంచి పేరు, గుర్తింపు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
‘వారిసు’తో విజయ్, ‘విక్రమ్’తో లోకేష్!
‘వారిసు’ బ్లాక్ బస్టర్ హిట్ తో తమిళ స్టార్ హీరో విజయ్ ఫుల్ జోష్ లో ఉండగా, ‘విక్రమ్’ సక్సెస్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ‘లియో’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ కనిపించనున్నారు. ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, శాంతి మాయాదేవి, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ఇతర ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే విజయ్ తో కలిసి ఆయన మూడు సినిమాలు చేశాడు. 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' సినిమాలకు అద్భుత సంగీతం అందించాడు. ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా నాలుగో సినిమాకు కూడా ఆయన సంగీతం అందించబోతున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ కోసం అన్బరివ్ పని చేయనున్నారు. ఫిలోమిన్‌రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దినేశ్ కొరియోగ్రఫీ, డైలాగులు లోకేష్కనగరాజ్, రత్నకుమార్, దీరజ్ వైదీ అందించనున్నారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమాతో లోకేష్ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు.. ‘విక్రమ్’ తరహాలో మరో బ్లాక్‌బస్టర్ ఇస్తారనే ఆశతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘లియో’ చిత్రం అక్టోబర్ 19, 2023న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Thanx a lot @actorvijay na for everything ❤️ pic.twitter.com/iSc31Xs9q1
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 14, 2023
Read Also: చరణ్, ఉపాసన జంటకు శుభాకాంక్షల వెల్లువ - స్పెషల్ పోస్ట్ లతో విషెస్ చెప్పిన సెలబ్రిటీస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)