అన్వేషించండి

Charan-Upasana: చరణ్, ఉపాసన జంటకు శుభాకాంక్షల వెల్లువ - స్పెషల్ పోస్ట్ లతో విషెస్ చెప్పిన సెలబ్రెటీస్

మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మొదలైయ్యాయి. రామ్ చరణ్ తండ్రి అయ్యారు. ఈ నేపథ్యంలో చరణ్-ఉపాసన జంటకు పలువురు టాలీవుడ్ సెలబ్రెటీస్ స్పెషల్ విషెస్ చెప్పారు.

Charan-Upasana: మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మొదలైయ్యాయి. రామ్ చరణ్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి ఉపాసన మంగళవారం(జూన్ 20) పండంటి పాపకు జన్మనిచ్చింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన డెలివరీ అయింది. దీంతో మెగా ఇంట ఆనందాలు వెల్లువిరిసాయి. ఇక టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అటు సోషల్ మీడియాలో కూడా పలువురు ప్రముఖులు చెర్రీ-ఉపాసన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ చిరు ట్వీట్..

మెగా మనవరాలికి వెల్కమ్ చెప్పారు చిరంజీవి. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘‘లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో మెగా ఫ్యామిలీతోపాటు కోట్లాది మందిలో ఆనందాన్ని నింపావు. రామ్ చరణ్-ఉపాసనలను తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ గా సంతోషించేలా చేశావు. ఇది మాకెంతో గర్వకారణం’’ అంటూ ట్వీట్ చేశారు చిరు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ క్షణాలు ఎప్పటికీ తీపి జ్ఞాపకాలే: ఎన్టీఆర్

మెగా ఇంట మహాలక్ష్మి రాకతో సందడి మొదలైంది. రామ్ చరణ్ తండ్రి అయ్యారు. మొట్టమొదటిసారి తన కూతుర్ని చేతుల్లోకి తీసుకొని మురిసిపోయారు చెర్రీ. ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విసెష్ ను అందజేశారు. ‘‘రామ్ చరణ్-ఉపాసనలకు శుభాకాంక్షలు, తల్లిదండ్రల క్లబ్ లోకి స్వాగతం.. పసిపాపతో గడిపిన ప్రతీ క్షణం మీకు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా గుర్తిండిపోతాయి. ఆ దేవుడు మీ పాపకు, మీకు ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించాలి’’ అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. 

వెల్కమ్ టూ హోమ్ లిటిల్ వన్ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్..

టాలీవుడ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ రామ్ చరణ్ జంటకు విసష్ చెప్పారు. చిన్నారి రాకతో ఆనందాలు  వెల్లివిరిసాయన్నారు. అలాగే తల్లిదండ్రులుగా చరణ-ఉపాసనల జర్నీ లైఫ్ లాంగ్ ఆనందంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పారు సాయి. ఈ పోస్ట్ చూసి ఆయన ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. 

శుభాకాంక్షలు చెప్పిన లావణ్య త్రిపాఠి..

చరణ్-ఉపాసన జంటకు శుభాకాంక్షలు చెప్పింది నటి లావణ్య త్రిపాఠి. మెగా ఇంటికి లిటిల్ ప్రిన్సెస్ వచ్చింది, ఈ ఆందాలు ఎప్పుడూ ఇలాగే మీతో ఉండాలి అంటూ ట్వీట్ చేసింది. ఇటీవలే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె కూడా మెగా ఫ్యామిలీలో చేరబోతోంది. 

చరణ్-ఉపాసన జంటకు శుభాకాంక్షలు: మంచు మనోజ్, మంచు లక్ష్మీ

రామ్ చరణ్ దంపతులకు టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారాయాన.. ‘ఈరోజు మంచి శుభవార్తతో మొదలైంది. పండంటి పాపకు తల్లిదండ్రులైన చరణ్-ఉపాసన జంటకు శుభాకాంక్షలు. మహాలక్ష్మి రాకతో మీ ఇంట ఎల్లప్పుడూ ఆనందాలు వెల్లువెత్తాలి’ అంటూ ట్వీట్ రాసుకొచ్చారు మనోజ్. అలాగే రామ్ చరణ్ జంటకు శుబాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది నటి మంచు లక్ష్మి. టాలీవుడ్ లోకి మరో లక్ష్మీ దేవి వచ్చిందంటూ మురిసిపోతూ శుభాకాంక్షలు తెలిపింది. 

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Vijay Deverakonda : 'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget