By: ABP Desam | Updated at : 06 Jan 2023 04:42 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Amazon Prime Video/Instagram
బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్-డికేలు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఓ లేటెస్ట్ వార్త ఒకటి బయటకు వచ్చింది. వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ చూసి షాహీద్, విజయ్ ఫ్యాన్స్ లుక్స్ అదిరిపోయాయని, వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కు మంచి క్రేజ్ ఉంది. అలాగే సౌత్ ఇండియన్ సినిమాల్లో విజయ్ సేతుపతికు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ వెబ్ సిరీస్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి మార్కెట్ బాగా పెరిగింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన విజయ్ సేతుపతి తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరో దగ్గరే ఆగిపోకుండా నటనకు ప్రాధాన్యతనిచ్చి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే విలన్ పాత్రల్లోనూ అదరగొడుతున్నాడు. దీంతో విజయ్ సేతుపతి అన్ని భాషల్లోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఇద్దరు పెద్ద హీరోలు కలసి నటిస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొంది.
ఇక ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ ను యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ లో షాహిద్ కపూర్ గుబురు గడ్డంతో క్యాజువల్ డ్రెస్ లో కనిపిస్తుండగా విజయ్ సేతుపతి స్టైలిష్‌గా కనిపిస్తున్నాాడు. క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందని సమాచారం. దీని బట్టి చూస్తే షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి పూర్తి వ్యతిరేకత ఉన్న క్యారెక్టర్లుగా అనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్ లు గా ఈ విడుదల కానుంది. ఈ సిరీస్ ను డి2ఆర్ ఫిల్మ్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కేకే మీనన్, రాశీ ఖన్నా, అమోల్ పాలేకర్, రెజీనా కసాండ్ర, భువన్ అరోరా ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?
K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు