అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘దేవర’ రిలీజ్ ట్రైలర్, మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ విడుదల నుంచి మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ రికార్డు వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమా సరికొత్త రిలీజ్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తన చిత్రాల్లో చేసిన డ్యాన్స్‌లకు మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా నజీరుద్దీని నిలిచాడు. హీరోయిన్ మాధవీలత... జానీ మాస్టర్‌పై ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ప్రోమోలో కంటెస్టెంట్లకు నాగార్జున ఫిటింగ్ పెట్టారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి
తెలుగులో వందల సంఖ్యలో సినిమాలో చేసిన హీరోలు ఉన్నాయి. భారతీయ సినీ పరిశ్రమలోనూ ఎంతో మంది స్టార్లు ఉన్నారు. ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న హీరోల మధ్యలో చిరంజీవి తన ప్రత్యేకత చాటుకోవడం వెనుక డ్యాన్సులది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ డ్యాన్సుల్లో చిరంజీవిది ప్రత్యేకమైన శైలి. చిరంజీవి 150కు పైగా సినిమాలు చేశారు. అందులో కొన్ని వందల పాటలకు తన శైలిలో నృత్యాలు చేశారు. చిరంజీవి తరహాలో స్టెప్పులు వేసిన ఇండియన్ హీరో మరొకరు లేదని చెబితే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన నృత్యాలకు గిన్నిస్ బుక్ ఫిదా అయ్యింది. డ్యాన్సులకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో మెగాస్టార్ చిరంజీవి స్థానం సంపాదించుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

గూస్‌బంప్స్ ఇచ్చేలా ‘దేవర’ రిలీజ్ ట్రైలర్
మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ ఇప్పటికే విడుదల అయింది. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌లో ‘దేవర’ వరల్డ్‌ను, పాత్రలను పరిచయం చేశారు. ఇప్పుడు పూర్తిగా సినిమాలో ఉన్న యాక్షన్‌పై ఫోకస్ చేస్తూ కొత్త రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘దేవర’లో యాక్షన్ ఏ స్థాయి ఊర మాస్‌గా ఉందో ఈ ట్రైలర్‌ను చూసి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్ మూవీ లవర్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చేలా కొత్త ట్రైలర్‌ను ‘దేవర’ టీమ్ కట్ చేసింది. ఇప్పటికే ఒక రకంగా దూసుకుపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఈ ట్రైలర్‌తో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం పక్కా అనుకోవచ్చు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు
బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలు టాలెంట్ ఉన్న యంగ్ స్టర్స్ పాలిట వరంగా మారాయి. అందులో ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 3 అనే సింగింగ్ షో కూడా ఒకటి. తాజాగా ఈ షోలో విన్ అయిన నసీరుద్దీన్ షేక్ అనే 19 ఏళ్ల సీఏ విద్యార్థికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో పాడే అద్భుతమైన ఛాన్స్ దక్కింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

జానీ మాస్టర్ ముస్లిం కనుక మాధవి లత ఫైర్
జానీ మాస్టర్ మీద ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, తనకు 18 ఏళ్లు నిండక ముందు ఆయన అత్యాచారం చేశాడని, మతం మార్చుకోవలసిందిగా తనను బలవంతం చేశారని ఆరోపణలు చేయడం తెలిసిన విషయాలే. ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసు మీద నటి, రాజకీయ నాయకురాలు మాధవి లత తరచూ వీడియోలు చేస్తున్నారు. జానీ ముస్లిం గనుక ఆవిడ ఈ వీడియోలు చేస్తున్నారని కొంతమంది నెటిజనులు విమర్శలు చేస్తున్నారు.‌ (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

టాస్క్‌తో ఫిటింగ్ పెట్టేసిన నాగ్
బిగ్​బాస్​ సండే ఫన్​డే మొదలైంది. నాగార్జున వస్తూనే.. కంటెస్టెంట్లకు ఈరోజు సండే ఫన్​డే నిన్నటిలా అసలు ఉండదంటూ స్టార్ట్ చేశారు. ఎందుకంటే శనివారం జరిగిన ఎపిసోడ్​లో నాగార్జున ఓ రేంజ్​లో కంటెస్టెంట్​లను రఫ్ఫాడించారు. ఈ వారం జరిగిన అన్ని విషయాలను ప్రస్తావిస్తూ సీరియస్​ అయ్యారు. ముఖ్యంగా అభయ్ నవీన్​ని ఇంట్లోనుంచి వెళ్లిపోమని రెడ్ కార్డ్ ఇచ్చారు. అలాగే పృథ్వీకి కూడా రెడ్ కార్డ్​ చూపించి.. మరోసారి ఇలా చేస్తే నీకు ఈ కార్డ్ తప్పదంటూ హెచ్చరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget