(Source: ECI/ABP News/ABP Majha)
Madhavi Latha on Jani Master: జానీ మాస్టర్ ముస్లిం కనుక మాధవి లత ఫైర్... కిషన్ రెడ్డి కళ్లల్లో పడటం కోసమేనా?
Jani Master Case Latest News: జానీ మాస్టర్ కేసు గురించి నటి, రాజకీయ నేత మాధవీ లత తరచూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరును కొందరు నెటిజనులు విమరిస్తున్నారు.
జానీ మాస్టర్ మీద ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, తనకు 18 ఏళ్లు నిండక ముందు ఆయన అత్యాచారం చేశాడని, మతం మార్చుకోవలసిందిగా తనను బలవంతం చేశారని ఆరోపణలు చేయడం తెలిసిన విషయాలే. ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసు మీద నటి, రాజకీయ నాయకురాలు మాధవి లత తరచూ వీడియోలు చేస్తున్నారు. జానీ ముస్లిం గనుక ఆవిడ ఈ వీడియోలు చేస్తున్నారని కొంతమంది నెటిజనులు విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
జానీకి అండగా నిలబడమని నిర్మాత మెసేజ్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత నుంచి తనకు మెసేజ్ వచ్చిందని తాజాగా విడుదల చేసిన వీడియోలో మాధవి లత తెలిపారు. జానీ మాస్టర్ కి అండగా వీడియోలు చేయమని సదరు నిర్మాత తనకు సూచించారని, ఎందుకు అని ఆయనను తాను ప్రశ్నించాను అని ఆమె పేర్కొన్నారు. ఆడపిల్లకు అన్యాయం చేస్తారా? అని తాను ప్రశ్నించానని ఆమె వివరించారు.
జానీ మాస్టర్ చేసిన ఒకే ఒక్క తప్పు పెళ్లి అయిన తర్వాత మరొక అమ్మాయిని ప్రేమించడం అని, అంతకు మించి ఆయన తప్పు ఏమీ లేదు అన్నట్లుగా నిర్మాత మాట్లాడడంతో మతమార్పిడి గురించి తాను ప్రశ్నించినట్లు మాధవి లత తెలిపారు. ఆ అమ్మాయిని గుడికి వెళ్ళనివ్వకుండా చేయడం, మతం మార్చుకోమని బలవంతం చేయడం ఎంతవరకు సబబు అని తాను అడగ్గా... మరి ఎందుకు ముస్లింని ప్రేమించిందని నిర్మాత తనను ప్రశ్నించారని, అది స్టుపిడ్ క్వశ్చన్ అనే తాను చెప్పానని మాధవి లత వివరించారు.
Also Read: 'దేవర'కు అండగా 'OG'... ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఎన్టీఆర్‌ను సపోర్ట్ చేస్తూ ట్వీట్
ఎవరైనా సరే మనిషిని ప్రేమిస్తారు కానీ మతాన్ని ప్రేమించరు అని, ఆ అమ్మాయిని మతం మార్చుకోమని బలవంతం చేశారు అంటే అది లవ్ జీహాదీ అని మాధవి లత వ్యాఖ్యానించారు. రెండు నెలల్లో ఈ కేసు క్లోజ్ అవుతుందని నిర్మాత తనతో చెప్పగా... న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది అని అలాగని గెలిచిందంతా న్యాయం కాదని తాను సమాధానం ఇచ్చానని మాధవి లత పేర్కొన్నారు. జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన ఆ అమ్మాయి వెనక ఎవరూ లేరు అని ఆవిడ తెలిపారు.
కిషన్ రెడ్డి బండి సంజయ్ కళ్ళల్లో పడడం కోసమేనా?
జానీ మాస్టర్ కేసు గురించి మాధవి లత వీడియోలు చేయడం వెనక భారతీయ జనతా పార్టీ పెద్దలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కళ్ళల్లో పడాలనే ఉద్దేశం ఉందా? ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అయ్యింది అంటే... ముస్లిం అయితేనే మాధవి లత సోషల్ మీడియాలోకి వస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అందుకు మాధవి లత కూడా చాలా గట్టిగా బదులిచ్చారు.
''వాళ్ల కళ్ళల్లో ఎందుకు పడాలి నేను? వాళ్లకి నేను బాగా తెలుసు. నువ్వు వర్రీ అవ్వకు. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు కనుక నేను మాట్లాడుతున్నాను. బీజేపీలో ఎవరు తప్పు చేసినా ప్రశ్నించేది నేనే. ఫేమస్ అవ్వడానికి ఒక అమ్మాయి బాధని వాడుకునే స్టేజిలో నేను లేను. నీకు ఒక సిస్టర్ ఉండి ఇలా జరిగితే బాగుండు'' అని మాధవి లత రిప్లై ఇచ్చారు.
Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే