అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘దేవర’ ఓటీటీలో ఎప్పుడు?, తమిళ హీరోతో అజయ్ భూపతి నెక్స్ట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘దేవర’ ఓటీటీ రిలీజ్ నుంచి అజయ్ భూపతి నెక్స్ట్ సినిమా వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

ఓటీటీలోకి ‘దేవర’ 50 రోజుల తర్వాతే రానుంది. తెలుగు దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తమిళ హీరో ధృవ్ విక్రమ్ ఓ భారీ సినిమా చేయనున్నారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆలియా భట్ హీరోగా నటించిన ‘జిగ్రా’ ట్రైలర్ గురువారం రిలీజ్ అయింది. జయం రవితో తనకు ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలపై సింగర్ కెనీషా స్పందించారు. దేవర మొదటి రోజు 150 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ
సెప్టెంబర్ 27వ తేదీన అంటే ఈ శుక్రవారం 'దేవర' సినిమా థియేటర్లలోకి వస్తుంది. అప్పటి నుంచి ఎనిమిది వారాల తర్వాతే ఈ చిత్రాన్ని ‌ఓటీటీల్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. సో... ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో డిజిటల్ రిలీజ్ అయ్యేందుకు ఏమాత్రం అవకాశం లేదు.‌ అయితే నవంబర్ నెలాఖరున విడుదల కావచ్చని అనుకోవచ్చు. దీనివల్ల నిర్మాతలకు ఓ ప్రత్యేకమైన లాభం ఉంటుంది. ఓటీటీ విండో ఎక్కువ ఉన్నందుకు థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్
తెలుగు దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తమిళ హీరో ధృవ్ విక్రమ్ ఓ భారీ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా తెరకెక్కనుందట. విక్రమ్, ఆయన తనయుడిని కలిసి అజయ్ భూపతి కొన్ని రోజుల క్రితం కలిశారని, ఒక కొత్త తరహా కథను చెప్పారని సమాచారం. కథ నచ్చడంతో పాటు అజయ్ భూపతి ట్రాక్ రికార్డ్ చూసి వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

స్టన్నింగ్ యాక్షన్‌తో ఆలియా భట్ ‘జిగ్రా’ ట్రైలర్
ఇటీవలే ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన తాజా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జిగ్రా’. ‘మోనికా, ఓ మై డార్లింగ్’ దర్శకుడు వాసన్ బాలా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. తమ్ముడి కోసం అక్క పడే ఆవేదన, పోరాటాన్ని ఈ ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు. యాక్షన్ సీన్స్‌లో ఆలియా మరో లెవల్‌లో నటించి అందరినీ మెప్పించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'జయం' రవితో ఎఫైర్‌పై స్పందించిన సింగర్ కెనిషా
తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారం గత కొద్ది రోజులుగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది. విడాకుల విషయంలో భార్య భర్తలు అయిన జయం రవి, ఆర్తి పరస్పర విరుద్ధ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విడాకులకు బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ సింగర్ కారణమంటూ వార్తలు వచ్చాయి. ఆమెతో జయం రవి ఎపైర్ కొనసాగిస్తున్నారని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నారంటూ ఓ తమిళ మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించింది. కానీ ఈ వార్తలను హీరో జయం రవి తీవ్రంగా ఖండించారు. ఓ ఆధ్యాత్మిక కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన విషయాలు మాట్లాడేందుకే ఆమెను కలిసినట్లు, అంతకు మించి తమ మధ్యలో ఏమీ లేదని వెల్లడించారు. అనవసరంగా ఈ వివాదంలోకి కెనీషాను లాగకూడదని జయం రవి మీడియాకు హితవు పలికారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'దేవర'తో ఎన్టీఆర్ సింహగర్జన
'దేవర'తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా రానున్నాడు. సినిమా విజయం మీద అటు మూవీ యూనిట్ సభ్యులకు గానీ, ఇటు అభిమానులకు అసలు ఎటువంటి సందేహాలు లేవని వారు ఇస్తున్న ఇంటర్వ్యూలు చూస్తే అర్థం అవుతుంది. బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించడం ఖాయం అని ఎర్లీ రిపోర్ట్ చూస్తే చిన్న పిల్లాడు కూడా చెప్పేయవచ్చు. అయితే మొదటి రోజు ఎన్ని కోట్లు దేవర కొల్లగొడతాడనేది అనేది క్వశ్చన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget