Raja Ravindra EMK Show: హోస్ట్ ఎన్టీఆర్‌కు షాకిచ్చిన కోటి రూపాయల విజేత రాజా రవీంద్ర.. అసలేం జరిగిందంటే!
Jr NTR EMK Show: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రాజా రవీంద్ర ఓ ప్రశ్నకు సమాధానం చెప్పిన వెంటనే ఎన్టీఆర్ తన సీటు నుంచి లేచి రాజా రవీంద్ర దగ్గరకు వెళ్లి పరిశీలించారు.
తెలుగులో ఓ షోలో తొలిసారిగా కోటి రూపాయాలు సాధించారు సబ్ ఇన్‌స్పెక్టర్ రాజా రవీంద్ర. గతంలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం డెప్యూటేషన్ మీద సీఐడీకి మారారు. సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలు అందిస్తున్న ఆయనకు యంగ్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో అవకాశం వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న రాజా రవీంద్ర ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.
ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి కోటి రూపాయలు గెలిచిన ఎపిసోడ్ నేటి రాత్రి ఎనిమిదన్నర గంటలకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది. దీన్ని సన్ నెక్ట్స్ యాప్‌లోనూ వీక్షించవచ్చు. అత్యంత వేగంగా హాట్ సీట్ ప్రశ్నకు సమాధానం చెప్పిన ఎస్ఐ రాజా రవీంద్ర తెలివి, ఆలోచనా శక్తికి, మైండ్ పవర్‌కు హోస్ట్ ఎన్టీఆర్ సైతం అవాక్కయ్యారు. తొలి ప్రశ్న నుంచి ఎంతో వేగంగా సమాధానం చెబుతున్న ఎస్ఐని మిగతా ఆప్షన్ల ఎందుకు సరైన సమాధానం కాదో అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా తడబడకుండా కంటెస్టెంట్ రాజా రవీంద్ర సమాధానాలు చెబుతూ ఎన్టీఆర్‌తో పాటు తెలుగు వారిని మెప్పించారు.
Also Read: Evaru Meelo Kotteswarulu: కోటి నెగ్గిన రాజా రవీంద్ర చాలా స్పీడ్ గురూ.. ఆయనను హాట్ సీటుకు తీసుకెళ్లిన ప్రశ్న ఏంటంటే!
Chittilu Pettukoni Vachara Enti 😂😂😂#EvaruMeeloKoteeswarulu @tarak9999 #21MagicalYearsOfNTR pic.twitter.com/834ZtRj7TA
— Mass Ka Baappp NTR 🌊 (@MassKaBaapNtr) November 15, 2021
చిట్టీలు తెచ్చావా అని ఎన్టీఆర్ చెకింగ్..
తనకు షూటింగ్ అంటే ఇష్టమని, చిన్నప్పుడు దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందా గన్ పేల్చుదామని ఎదురుచూసేవాడినని రాజా రవీంద్ర చెప్పారు. రూ.12,50,000 అందించే 12వ ప్రశ్నకు సమాధానం చెప్పిన వెంటనే ఎన్టీఆర్ తన సీటు నుంచి లేచి రాజా రవీంద్ర దగ్గరకు వెళ్లి పరిశీలించారు. చిట్టీలు ఏమన్నా తెచ్చావా అంటూ నవ్వులు పూయించారు. వాస్తవానికి ఏదైనా ప్రశ్నకు తాను సమాధానంతో పాటు వివరాలు చెప్పాలని, కానీ తాను చెప్పాల్సిన వివరాలు సైతం అద్భుతంగా చెప్పారంటూ రాజా రవీంద్రను మెచ్చుకున్నారు. మైండ్ పవర్ సూపర్, మీ డేటా బ్యాంకు బాగుందని ఇలాగే ముందుకు సాగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. నెటిజన్లు సైతం చిట్టీలు తెచ్చావా అనే పదానికి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ ఎడిగిన 12వ ప్రశ్న ఏంటంటే..
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పిన తర్వాత తారక్ మళ్ళీ ఆయన్ని దానికి సంభందించిన ఇంకొక ప్రశ్న అడగటం , ఒక ట్రివియా లాగా ఆయన అన్నిటికీ క్లియర్ సమాధానం ఇవ్వటం🙏 Who deserves more than him to win 1CR... Most Disciplined n Dedicated Contestant 👏@tarak9999 #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/5gK9xB6BBI
— Pramoda Paruchuri (@iampramoda) November 16, 2021
ఒకే పారాలింపిక్స్‌లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు?
a. అవనీ లేఖరా
b. దీపా మాలిక్
c. అంజలీ భగవత్
d. భవీనా పటేల్
అవనీ లేఖరా అని రాజా రవీంద్ర సమాధానం చెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పారాలంపిక్స్ లో స్వర్ణాన్ని, 50 మీటర్ల రైఫిల్ విభాగంలో కాంస్యం నెగ్గారని ఎస్ఐ రాజా రవీంద్ర వివరించారు.
Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్