Samantha: అమెరికా నుంచి తిరిగి వచ్చిన సమంత, సడెన్ గా రావడానికి కారణం ఏంటో తెలుసా?
నటి సమంత అమెరికా నుంచి తిరిగి వచ్చింది. మయోసైటిస్ చికిత్స కోసం యుఎస్ కు వెళ్లిన సమంతా ఇంత త్వరగా ఎందుకు వచ్చిందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా జరుగుతోంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటించిన తాజా చిత్రం 'ఖుషి'. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో విజయ్, సామ్ నటన అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. అయితే, అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఇంకా సేఫ్ జోన్‌లోకి ప్రవేశించలేదు. నష్టాలను నివారించాలంటే చిత్రబృందం సినిమాను మరింత ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందనే టాక్ నడుస్తోంది.
‘ఖుషి’ ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనని సమంత
హీరో విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు యాక్టివ్ గా నిర్వహించాడు. హీరోయిన్ సమంత మాత్రం తన హెల్త్ మీదే ఫోకస్ పెట్టింది. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కాన్సెర్ట్ లో మాత్రం సమంత పాల్గొంది. ఈ వేడుకలో సమంత, విజయ్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ తర్వాత ఆమె మళ్లీ అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ వెకేషన్ లో సదాగా గడుపుతూ కనిపించింది. అమెరికాకు పర్యటనకు ముందు బాలిలోనూ ఎంజాయ్ చేసింది. ప్రకృతిలో ఆహ్లాదంగా గడిపింది. ‘ఖుషి’ ప్రమోషన్ విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా ఆమె మరే ఈవెంట్ లో పాల్గొనలేదు. ఆమె దాదాపు 3 నెలలు అమెరికాలోనే ఉండి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించింది.
సమంత సడెన్ గా అమెరికా నుంచి ఎందుకు వచ్చిందంటే?
కానీ, సమంత సడెన్ గా అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. నిజానికి సమంత రాక వెనుక కారణం వేరే ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ లో ‘ఖుషి’ అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ఈ సినిమా ఇంకా సేఫ్ జోన్‌లోకి ప్రవేశించలేదు. నష్టాలను నివారించడానికి టీమ్ ఇప్పుడు సినిమాను బాగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సమంత అమెరికా నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. హీరో, విజయ్ తో కలిసి సినిమా ప్రమోషన్ లో పాల్గొని నష్టాల నుంచి గట్టెక్కించాలని సమంత భావిస్తుందట.
ఇక నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మించిన ‘ఖుషి’ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడిగానే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రాశారు.
Read Also: అనుష్క తల్లి బాలకృష్ణకు వీరాభిమాని- ఈ ఇంట్రెస్టింగ్ విషయం మీకు తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial