అన్వేషించండి
Advertisement
Surya Jyothika Diwali Celebrations: హీరో సూర్య ఇంట్లో రాధికా శరత్ కుమార్, అందరూ కలసి బుల్లెట్ సాంగ్ కి స్టెప్పులు
ఎప్పుడూ సినిమాల్లో బిజీ గా ఉండే సూర్య, కార్తీ ఈసారి దీపావళిని తన ఫ్యామిలీ అందరితో కలసి జరుపుకున్నారు. ఈ పండుగలో మరో విశేషము ఏంటంటే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
దీపావళి పండుగ అంటే వెలుగులతో నిండిపోయే పండుగ. ఈ పండగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలెబ్రెటీలు ఈ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు చాలా మంది సెలెబ్రెటీలు పండుగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తమ ఫీలింగ్ ను అందరితో పంచుకుంటున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తీలు తమ ఫ్యామిలీతో కలసి ఈ దీపావళి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. మరో విశేషం ఏంటంటే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను రాధికా శరత్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. శివకుమార్ అన్న ఇంట్లో సూర్య, కార్తీ, బృందతో దీపావళి పండుగ సరదాగా జరుపుకున్నట్లు రాసుకొచ్చారు.
అంతేకాకుండా శివకుమార్, సూర్య, కార్తీ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. వీటితో పాటు వేడుకలో సరదాగా గడిపిన వీడియోలను కూడా షేర్ చేశారు రాధిక. సూర్య, కార్తీ ఫ్యామిలతో కలసి 'కమాన్ బేబీ లెట్స్ గో బుల్లెట్టు' అనే సాంగ్ కి డాన్స్ వేస్తూ కనిపించారు. ఈ పాటలో అందరితో కలసి రాధికా శరత్ కుమార్ కూడా స్టెప్పులేశారు. అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మరో చిన్న వీడియో ను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండే వీరు ఇలా సంతోషంగా దీపావళి పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హీరో సూర్య 'జై భీం' సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా లో తన నటనకు వందశాతం మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'విక్రమ్' లో నటించారు. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ కాకపోయినా డ్రగ్స్ మాఫియా డాన్ గా చివరి 5 నిమిషాల్లో కనిపించి సినిమాకే హైలెట్ గా నిలిచారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్నారు సూర్య. సూర్య తమ్ముడు కార్తీ కూడా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. 'పొన్నియన్ సెల్వన్' సెల్వన్ సినిమా తర్వాత దీపావళి సందర్భంగా 'సర్దార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కార్తీ. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ఖైదీ మూవీ సీక్వెల్ కూడా త్వరలో రాబోతోంది. అయితే ఖైదీ మూవీకి, విక్రమ్ మూకీ కనెక్టివిటీ ఉండటంతో ఆ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Deepavali with #sivakumar anna and family @Suriya_offl @Karthi_Offl #jotika @Brindhashiv pic.twitter.com/CQ4GOifyaO
— Radikaa Sarathkumar (@realradikaa) October 25, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement