Manchu Manoj: మంచు మనోజ్ సినిమా నుంచి డైరెక్టర్ వాకౌట్!
రెండేళ్ల క్రితం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా అనౌన్స్ చేశారు మంచు మనోజ్. షూటింగ్ మొదలుపెట్టినట్లు కూడా చెప్పారు.
మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు మంచు మనోజ్. కెరీర్ ఆరంభంలో కొన్ని హిట్టు సినిమాల్లో నటించారు. తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తరువాత వరుసగా ప్లాప్స్ రావడంతో సినిమాలు చేయడం తగ్గించారు. మధ్యలో తన భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం ఇండస్ట్రీకి మరింత దూరమయ్యారు. ఎక్కువగా తిరుపతిలోనే ఉంటూ తన ఫ్యామిలీకి చెందిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఇప్పుడు కూడా ఆయన తిరుపతిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రెండేళ్ల క్రితం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా అనౌన్స్ చేశారు మంచు మనోజ్. షూటింగ్ మొదలుపెట్టినట్లు కూడా చెప్పారు. దీంతో అభిమానులు ఈ సినిమా అతడికి మంచి కమ్ బ్యాక్ అవ్వాలని ఆశించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. కరోనా రావడంతో సినిమా షూటింగ్ ఆపేశారు. ఆ తరువాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టలేదు.
మనోజ్ తన బరువు తగ్గే పనిలో పడడంతో సినిమా కోసం తగ్గుతున్నారేమో అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు 'అహం బ్రహ్మాస్మి' సినిమా ఆగిపోయిందని సమాచారం. ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా చేయడం, దాని మీద ఉండడం తన వల్ల కాదని చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి వచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి.. వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా మొదలుపెట్టారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి చిన్న వీడియో వదిలారు.
అందులో డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. చిన్న వీడియోతోనే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు శ్రీకాంత్ రెడ్డి. వైష్ణవ్ తో తీస్తున్న సినిమా 'అహం బ్రహ్మాస్మి' ప్రాజెక్టునే అనే మాటలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పట్లో మంచు మనోజ్ రీఎంట్రీ కష్టమే అనిపిస్తోంది. ఇక ఆయన బిజినెస్ వ్యవహారాలతో బిజీ అయిపోతారేమో!
Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
View this post on Instagram