అన్వేషించండి

Sukumar Respects SS Raja Mouli: రాజమౌళికి ఆస్కార్ కంటే పెద్ద అవార్డిచ్చిన సుకుమార్, ఇకపై ఆ స్థానం ఆయనదే

ఒక ప్రముఖ దర్శకుడు.. మరో దిగ్గజ దర్శకుడికి ఇలాంటి స్థానాన్ని గౌరవంగా అందిస్తారని ఎవరైనా ఊహించగలరా? అయితే, దర్శకుడు సుకుమార్ అది చేసి చూపించారు.

‘బాహుబాలి’, RRR సినిమాలతో ఇండియన్ మూవీ సత్తాను చాటిన దర్శకధీరుడు రాజమౌళి. ఓ తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో మోత మోగించిన దర్శక జక్కన్నను ఎంత పొగిడినా తక్కువే. ఇక లెక్కల మాస్టార్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన టేకింగ్ గురించి ‘పుష్ప’రాజ్ సృష్టించిన ప్రభంజనమే చెబుతుంది. ‘‘తగ్గేదేలే..’’ అంటూ బన్నీ క్రియేట్ చేసిన రికార్డులే ఆయన గురించి మాట్లాడతాయి. రాజమౌళి, సుకుమార్ ఇద్దరూ ఇద్దరే. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసిన బిగ్గెస్ట్ థింగ్స్. ఇప్పుడు RRR ‘‘నాటు నాటు’’ పాట ఆస్కార్స్ లో ఉందని తెలియగానే... రాజమౌళి ఎంత హ్యాపీగా ఫీలయ్యారో కానీ సుకుమార్ మాత్రం రాజమౌళి విషయంలో తనెంత ఎమోషనల్ అనేది ఫేస్ బుక్ పోస్టుతో స్పష్టమవుతుంది. 

‘పుష్ప 2’ ప్రీ పొడక్షన్ పనుల్లో ఉన్న సుకుమార్ తన రైటింగ్ టీమ్ తో కలిసి కూర్చున్న ఓ ఫోటోను షేర్ చేశారు. సాధారణంగా తనకు చాలా సంవత్సరాలుగా ఉన్న ఓ అలవాటు గురించి కూడా చెప్పారు. తన టీమ్ తో స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నప్పుడు మెయిన్ గా డైరెక్టర్ కోసం వేసే ఛైర్ ను ఖాళీగా ఉంచేస్తారంట సుకుమార్. ఇన్నాళ్లూ అలా ఎందుకు చేశారో తెలియదు. కానీ, RRR ఆస్కార్స్ కు వెళ్లిన తర్వాత తనకు అర్థమైందంటూ పోస్ట్ పెట్టారు. ఆ ఛైర్ లో కూర్చునే అర్హత ఇకపై రాజమౌళిదేనని.. ఇది ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ రాజమౌళి కోసమే ఉంటుందంటూ ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేశారు సుకుమార్. 

రాజమౌళిపై సుకుమార్ కున్న అఫెక్షన్ అండ్ లవ్ ఇప్పటిది కాదు. వాళ్లిద్దరూ చాలా సందర్భాల్లో తమకు ఒకరి మీదున్న మ్యూచువల్ రెస్పెక్ట్ ను షేర్ చేసుకున్నారు. రాజమౌళిని ఇప్పుడు కూడా తన ఫేవరేట్ డైరెక్టర్ అంటే సుకుమార్ పేరు చెప్తారు. సుకుమార్ ను అడిగితే రాజమౌళినే నా హీరో అని చెప్తారు. ఇద్దరు మాస్టర్ మైండ్ ఉన్న డైరెక్టర్స్ ఇలా ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం.. ఒకరి వర్క్ ను మరొకరు మెచ్చుకోవటం చూస్తుంటే సినిమా అభిమానులకు గూస్ బంప్స్ రాకమానవు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sukumar B (@aryasukku)

‘ఆస్కార్’ నామినేషన్స్‌ జాబితా ఇదే:

సినిమా

1 అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌
2 టాప్‌గన్‌: మావెరిక్‌
3 ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
4 ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
5 ఎల్విస్‌
6 ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
7 ది ఫేబుల్‌మ్యాన్స్‌
8 టార్‌
9 ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌
10 ఉమెన్‌ టాకింగ్‌

దర్శకుడు

  దర్శకుడి పేరు

ఏ సినిమాకు?

1 మార్టిన్‌ మెక్‌డొనాగ్‌  ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
2 డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌  ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
3 స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌  ది ఫేబుల్‌మ్యాన్స్‌
4 టడ్‌ ఫీల్డ్‌  టార్‌
5 రూబెన్‌ ఆస్ట్లాండ్‌ ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌

నటుడు

  నటుడి పేరు ఏ సినిమాకు?
1 ఆస్టిన్‌ బట్లర్‌  ఎల్విస్‌
2 కొలిన్‌ ఫార్రెల్‌ ది బాన్షీస్‌ ఆఫ్‌ ఇనిషైరైన్‌
3 బ్రెండన్‌ ఫ్రాసెర్‌  ది వేల్‌
4 పాల్‌ మెస్కల్‌  ఆఫ్టర్‌సన్‌
5 బిల్‌ నిగీ  లివింగ్‌

నటి

  నటి పేరు ఏ సినిమాకు?
1 కేట్‌ బ్లాంషెట్‌ టార్‌
2 అన్నా దె అర్మాస్‌  బ్లాండ్‌
3 ఆండ్రియా రైజ్‌బరో  టు లెస్లీ
4 మిషెల్‌ విలియమ్స్‌  ది ఫేబుల్‌మ్యాన్స్‌
5 మిషెల్‌ యో  ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

  సినిమా పేరు ఏ దేశానికి చెందిన సినిమా?
1 ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌  జర్మనీ
2 అర్జెంటీనా, 1985  అర్జెంటీనా
3 క్లోజ్‌  బెల్జియం
4 ఇయో  పోలండ్‌
5 ది క్వైట్‌ గాళ్‌  ఐర్లాండ్‌

సహాయ నటుడు

  నటుడి పేరు ఏ సినిమాకు?
1 బ్రెన్డాన్‌ గ్లెసన్‌  ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
2 బ్రైయిన్‌ టైరీ హెన్రీ  కాజ్‌వే
3 జడ్‌ హిర్చ్‌  ది ఫేబుల్‌మ్యాన్స్‌
4 బేరీ కియోఘాన్‌  ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
5 కి హుయ్‌ క్వాన్‌   ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

సహాయ నటి

  నటి పేరు ఏ సినిమాకు?
1 ఆంజెలా బాస్సెట్‌  బ్లాక్‌ పాంథర్‌: వకండ ఫరెవర్‌
2 హాంగ్‌ చ్యూ  ది వేల్‌
3 కెర్రీ కాండన్‌  ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
4 జామీ లీ కర్టిస్‌  ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
5 స్టెఫానీ  ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ఒరిజినల్‌ సాంగ్‌

  పాట ఏ సినిమాలోనిది?
1 నాటు నాటు  ఆర్‌ఆర్‌ఆర్‌
2 అప్లాజ్‌  టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌
3 హోల్డ్‌ మై హ్యాండ్‌   టాప్‌గన్‌: మార్వెరిక్‌
4 లిఫ్ట్‌ మీ అప్‌  బ్లాక్‌ పాంథర్‌
5 ది ఈజ్‌ ఏ లైఫ్‌  ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Embed widget