అన్వేషించండి

మీకెందుకంత బాధ? హీరోయిన్‌కు ‘ముద్దు’పై స్పందించిన దర్శకుడు రవి కుమార్

హీరోయిన్ ను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న వ్యవహారంపై దర్శకుడు ఏఎస్ రవి కుమార్ స్పందించారు. ఆమెకే ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు మిగతా వాళ్లు ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ప్రశ్నించారు.

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరోయిన్ మన్నారా చోప్రాకు డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. చిత్రబృందం ఫొటోకు ఫోజులు ఇస్తున్న సమయంలో, అందరూ చూస్తుండగానే హీరోయిన్​కు దర్శకుడు ముద్దు పెట్టాడు. దర్శకుడు చేసిన పనికి మన్నారా షాక్ అయ్యింది. చాలా ఇబ్బంది అనిపించినా, మనసులో దాచుకుని నవ్వుతూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సినిమా పరిశ్రమలో ఇవన్నీ కామన్ అని కొందరు అంటే,  దర్శకుడికి ఇదేం పోయేకాలం? అని మరికొంత మంది మండిపడ్డారు.  హీరోయిన్ తో దర్శకులకు చనువు ఉండటం కామన్. అయినా, ఇలా మీడియా ముందు, అందరూ చూస్తుండగా ఇదేం చెత్త పని అంటూ నిప్పులు చెరిగారు.  దర్శకుడు హుందాగా వ్యహరించాలే తప్ప, చిల్లర చేష్టలు చేయకూడదన్నారు.  

ముద్దు వ్యవహారంపై స్పందించిన రవి కుమార్

తాజాగా ఈ ఘటనపై దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. మన్నారాపై ప్రేమానురాగాలతో ముద్దుపెట్టుకున్నానని చెప్పారు. అంతేతప్ప చెడు ఉద్దేశంతో తాను ఆ పని చేయలేదన్నారు. “హీరోయిన్ మన్నారపై ప్రేమ, అనురాగంతోనే ముద్దు పెట్టుకున్నాను. ఆమెను   ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ముద్దు వ్యవహారంలో నటి మన్నారా చోప్రాకే సమస్య లేనప్పుడు, జనాలు ఎందుకు అతిగా స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు. నా కూతురిని కూడా ఇలాగే ముద్దుపెట్టుకుంటాను. ఇందులో నాకు ఏమీ తప్పు అనిపించలేదు. ఇప్పటికైనా ఈ వివాదం గురించి మాట్లాడ్డం మానేస్తే బాగుంటుంది” అని రవి కుమార్ తెలిపారు.

సినిమాపై అంచనాలు పెంచిన టీజర్

ఇక బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ఏఎస్ రవికుమార్. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తోంది. మేకర్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందమైన ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. చలాకీ కుర్రాడు రాజ్ తరుణ్ పిరికివాడికి కనిపించడం ఆసక్తికరంగా ఉంది. అతని లవర్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది.  మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో నటించారు.  మన్నార్ చోప్రా కీలక పాత్ర పోషించింది. లేటెస్ట్ టీజర్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగాయి. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.

Read Also: షారుఖ్‌తో ప్రేమలో ఉన్న అమ్మాయిపై పగ తీర్చుకున్నా- విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget