అన్వేషించండి

Gunasekhar: వివాదంలో ‘హిరణ్యకశ్యప’ మూవీ - రానాపై గుణశేఖర్ గరం గరం, ఆ శాపనార్థాలు ఆయనకేనా?

రానా నుంచి రాబోతున్న సినిమా ‘హిరణ్యకశ్యప’ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై దర్శకుడు గుణశేఖర్ పరోక్షంగా కౌంటర్ వేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Gunasekhar: టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి కెరీర్ ప్రారంభం నుంచీ హీరోగానే కాకుండా కథకు బలం ఉన్న పాత్రలనే చేస్తూ వస్తున్నారు. అందుకే అంత క్రేజ్ సంపాదించుకున్నారు. ‘విరాట పర్వం’ తర్వాత రానా నుంచి రాబోతున్న సినిమా ‘హిరణ్యకశ్యప’. ‘అమర్ చిత్ర కథ’ కామిక్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఇప్పుడీ సినిమా కొత్త వివాదాల్లో చిక్కుకుంది. అమెరికాలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్ లో ‘హిరణ్యకశ్యప’ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం దర్శకుడు గుణశేఖర్ పనిచేస్తున్నారు. అయితే పోస్టర్ పై కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తారు అంటూ వేశారు. తర్వాత దర్శకుడు గుణ శేఖర్ ఓ సంచలన ట్వీట్ ను పోస్ట్ చేశారు ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ దేవుడు మీకు తగిన శాస్తి చేస్తాడు: గుణ శేఖర్

వాస్తవానికి ఈ ‘హిరణ్యకశ్యప’ అనే కథ గుణశేకర్-రానా కాంబోలో వస్తుంది. ఇప్పటికే దీనిపై కొన్నేళ్ల పాటు గుణశేకర్ వర్క్ చేశారు. పలు సార్లు రానాతో కూడా చర్చలు జరిపారు. ఆల్రెడీ అందుకు సంబంధించిన వివరాలను గతంలో కూడా దర్శకుడు తెలియజేశారు. తర్వాత ఆ సినిమాను కొంతకాలం పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు సడెన్ గా రిలీజ్ చేసిన పోస్టర్ పై తన పేరు కనిపించలేదు. పోస్టర్ రిలీజ్ తర్వాత గుణశేఖర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ‘‘దేవుడినే ఇతివృత్తంగా చేసుకుని మీరు కథ తయారు చేసినప్పుడు.. ఆ దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని మరిచిపోవద్దు. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా ఆ దేవుడే సమాధానం ఇస్తాడని తెలుసుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది రానా ‘హిరణ్యకశ్యప’ ను టార్గెట్ చేసే గుణశేఖర్ ఇలా ట్వీట్ చేశారని తెలుస్తోంది.  

గుణశేఖర్ కు కు నెటిజన్స్ మద్దతు, స్పందించని రానా..

ఇప్పుడు గుణశేఖర్ పోస్ట్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో చాలా మంది గుణశేకర్ కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు. గుణశేఖర్ తో ప్రాజెక్ట్ అనుకొని ఇప్పుడు రానా ఇలా ప్రకటన చేయడం దర్శకుడుని అగౌరవ పరిచినట్లేనని గుణశేఖర్ కు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే గుణశేఖర్ ట్వీట్ పై రానా ఇప్పటి వరకూ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇటీవల సమంతతో తెరకెక్కించిన ‘శాకుంతలం’ సినిమా డిజాస్టర్ గా నిలవడమే ఇప్పుడు ఈ సినిమా నుంచి గుణశేఖర్ ను తప్పించేలా చేసిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై రానా ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాను రానా స్పిరిట్ మీడియా సంస్థ నిర్మించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథని సిద్ధం చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా రానా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో కనిపించారు. ఆయన సిల్వర్ స్క్రీన పై చివరిగా కనిపించిన సినిమా విరాట పర్వం. 

నాకు అన్యాయం జరిగితే ఊరుకోను: గుణశేఖర్

‘హిరణ్యకశ్యప్’ ప్రాజెక్ట్ చేతులు మారుతుందనే వార్తలు వారడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక రీసెంట్ గా ఆ మూవీ పోస్టర్ రిలీజ్ లో దర్శకుడు గుణశేఖర్ పేరు కనిపించకోవడంతో ఆ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శకుడు గుణశేఖర్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను ఒక కథతో సినిమా తీద్దామని అనుకున్నానని, అయితే ఆ ప్రాజెక్ట్ లో తనతో వచ్చి జాయిన్ అయిన వాళ్లే ఇప్పుడు విడిపోయి అదే కథతో సినిమా తీస్తాను అంటే తానెలా ఒప్పుకుంటానని అన్నారు. ఇండస్ట్రీలో కొన్ని విలువలు ఉంటాయని, వాటిని పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. తాను చెప్పిన కథను కాకుండా వేరే కోణంలో సినిమా తీస్తే తానేమీ అభ్యంతరం తెలపనని, కానీ అదే కథతో సినిమా తీస్తే కచ్చితంగా అడ్డుకుంటానని అన్నారు. తనకు అన్యాయం జరిగితే ఊరుకోనని హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget