Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?
నిర్మాతగా దిల్ రాజు లెక్కల విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు.

'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు శంకర్. కానీ ఇప్పుడు శంకర్ తన ఫోకస్ మొత్తం 'ఇండియన్2' సినిమాపైనే పెట్టినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో మొదలుపెట్టాలనుకున్న కొత్త షెడ్యూల్ ను ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ నెల మొత్తం చరణ్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో కూడా కొన్ని రోజుల పాటే షూటింగ్ జరిగింది.
ఇప్పటివరకు చరణ్ తన తదుపరి సినిమాపై నిర్ణయం తీసుకోలేదు. అందుకే ఆయన ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మరో సినిమా కోసం రామ్ చరణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏవీ కొలిక్కి రావడం లేదు. 'విక్రమ్' సినిమా హిట్ అవ్వగానే కమల్ హాసన్ తో భారీ సినిమా వర్కవుట్ అవుతుందని నిర్మాతలకు, శంకర్ కు నమ్మకం కలిగింది. దాంతో ఆగిపోయిన 'ఇండియన్2' సినిమాను హడావిడిగా తీస్తున్నారు. బహుశా వేరే దర్శకుడెవరైనా ఇలా చేస్తే చరణ్ ఒప్పుకునేవారు కాదేమో. కానీ అక్కడ శంకర్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కావడంతో ఆయన సైలెంట్ గా ఉండాల్సివస్తుంది.
ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!
Also Read: ప్రభాస్, రామ్‌చరణ్‌లతో త్రివిక్రమ్ సినిమాలు - రివీల్ చేసిన నిర్మాత!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















