(Source: ECI/ABP News/ABP Majha)
Dhanush: తన తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వృద్ధ దంపతులకు నోటీసులు పంపిన ధనుష్
ధనుష్ తమ కొడుకునేనని గత కొన్నేళ్లుగా ఒక జంట పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళ సూపర్ హీరో ధనుష్. గత కొన్నేళ్లుగా ఆయన్ను ‘తల్లిదండ్రుల’ కేసు మాత్రం వదలడం లేదు. దాదాపు అయిదారేళ్లుగా కోర్టులో ఆ విషయంపై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ధనుష్ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆ వృద్ధ దంపతులకు నోటీసులు పంపాడు. ఆ నోటీసులో తనపై ఆరోపణలు చేయడం మానివేయాలి, క్షమాపణలు చెబుతూ ప్రకటన చేయాలని కూడా కోరుకున్నాడు. లేకుంటే రూ.10కోట్లకు పరువు నష్టం వేస్తానని న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. దీంతో మళ్లీ ధనుష్ తల్లిదండ్రుల కేసు మళ్లీ తెర ముందుకు వచ్చింది.
తమిళనాడుకు చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు 2017లో ధనుష్ తమ కొడుకేనంటూ కోర్టు కెక్కారు. తమ మూడో అబ్బాయి అని, అతనికి సినిమాల మీద ఆసక్తి ఉండడంతో చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడని చెప్పారు. కొడుకుగా వృద్ధులైన తమను చూసుకోవాలని, తమ బాగోగుల కోసం నెలకు రూ.65000 చెల్లించేలా ధనుష్ ఆదేశించాలని వారు కోరుతూ కోర్టుకెక్కారు. గత అయిదేళ్లుగా కేసు నలుగుతూనే ఉంది. తాను తమిళ సినీ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడినని ధనుష్ కోర్టుకు విన్నవించాడు. తన పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా అని కోర్టుకు తెలిపారు.
డీఎన్ఎ టెస్టులు చేయాలని కతిరేసన్ దంపతులు కోరారు. కానీ దానికి ధనుష్ ఒప్పుకోలేదు. పుట్టుమచ్చలు కూడా చెక్ చేయించారు. అలాగే జనన పత్రాలు కూడా చూపించారు. ఏవీ కూడా కేసును ఓ కొలిక్కి తీసుకురాలేదు. దీంతో మళ్లీ కేసు కోర్టు ముందుకు వచ్చింది. కదిరేసన్ దంపతులు మాత్రం కేసును వెనక్కి తీసుకునేదే లేదని, ధనుష్ తమ బిడ్డేనని, డీఎన్ఏ టెస్టులు చేస్తే నిజం తేలుతుందని అంటున్నారు.
View this post on Instagram
Also read: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి