By: ABP Desam | Updated at : 22 May 2022 12:22 AM (IST)
Image Credit: Disney Plus Hotstar
బిందు మాధవి.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ఇప్పటివరకు ‘బిగ్ బాస్’లో పాల్గొన్న ఎంతోమంది లేడి కంటెస్టెంట్లు పాల్గొన్నా.. టైటిల్‌ను గెలుచుకోలేకపోయారు. ఇప్పటివరకు వచ్చిన ‘బిగ్ బాస్’ ఐదు సీజన్లలో హరితేజ, శ్రీముఖి, గీతామాధురీ టైటిల్ వరకు వచ్చి.. రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. అయితే, కొత్తగా మొదలైన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ సీజన్‌లో మాత్రం అంచనాలన్నీ తారుమారు చేసింది బిందు మాధవి. ఈ కొత్త సీజన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అఖిల్ సార్ధక్‌ను దాటుకుని బిందు విజేతగా నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం నటరాజ్ మాస్టరే.
నటరాజ్ మాస్టర్ తనకు తాను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా భావిస్తారు. ఆయన మీద ఎవరైనా ఆరోపణలు చేసినా, ఆయన్ని వేలెత్తి చూపినా తట్టుకోలేరు. దీంతో చాలామంది కంటెస్టులు అతడితో పెట్టుకోవడం ఎందుకులే అని వెనకడుగు వేసేవారు. ముఖ్యంగా నామినేషన్ల సమయంలో నటరాజ్ మాస్టర్‌ను తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆయన ఏ క్షణంలో ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. దీంతో అతడిని నామినేట్ చేసే సహసం చేయలేకపోయేవారు. కానీ, బిందు మాధవి మాత్రం అలా కాదు. తాను అనుకున్నది ముఖంపైనే చెప్పేది. మాటకుమాట సమాధానం ఇస్తూ.. నటరాజ్ ఇగోను రెచ్చగొట్టేది. దీంతో నటరాజ్ మాస్టర్ కూడా రెచ్చిపోయేవారు. ఆమెను ఎమోషనల్‌గా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ, బిందు ఆయన మాటలను సీరియస్‌గా తీసుకొనేది కాదు. ఆమె స్థానంలో మరొకరు ఉంటే తప్పకుండా ఏడ్చేస్తారు.
Also Read: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి - విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్
కానీ, బిందు మాత్రం అలా చేయలేదు. ధైర్యాన్ని ప్రదర్శించింది. ఒకానోక క్షణంలో ఆయనతో శపథం కూడా చేసింది. తాను విన్నరై చూపిస్తానని చెప్పింది. బిందును శూర్పణక అని, ‘‘ప్రేక్షకులు నీ ముక్కు కోస్తారు’’ అంటూ.. నటరాజ్ కెమేరా వైపు తిరిగి బిందు ఇమేజ్‌ను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు బిందు మాటలతో సమాధానం ఇవ్వలేదు. తాను శూర్పణక కాదని, కాళీమాతనంటూ మహిషాసుర మర్దినిలా నిలుచుని.. నటరాజ్‌కు తగిన జవాబు ఇచ్చింది. ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొంది. చివరికి, బిందు మాధవి నమ్మకం, ధైర్యమే గెలిచింది. ఈ నేపథ్యంలో అఖిల్ ఓడిపోయాడని చెప్పలేం. నటరాజ్ మాస్టార్‌కు తగిన సమాధానం చెప్పాలనే లక్ష్యంతో బిందు మాధవికి ఎక్కువ మంది ఓటేశారు. ఫలితంగా అఖిల్ విజయానికి గండిపడింది. బిందు విజయం తర్వాత.. ఆమె అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నటరాజ్ మాస్టార్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.
Better don't come in my way
— viswanath (@viswanath5520) May 21, 2022
Nataraj ne mudhe Cup lift chesta andhi Adhi ra ma #BinduMadhavi Annte
Cup kotti chupinchindi 🏆💯❤️💥#AadaPuliBinduMadhavi#BinduTheSensation#BiggBossNonStop pic.twitter.com/gdhEZCZAki
Why bindu winner అంటే..
— kalavathiᵂᴵᴺᴺᴱᴿ ᴮᴵᴺᴰᵁ (@crazy_smily) May 21, 2022
ఏది అనిపిస్తే అది మొహం మీద చెప్పి వెనక మాట్లాడటం చేయలేదు అందుకే అందరికి ఎక్కువ నచ్చింది..
Nataraj master లాంటి వాళ్ళు అమ్మాయి ని emotional గా weak చేసి game ఆడాలని చూసిన అందరిలా ఏడవకుండా చుక్కలు చూపించిన guts నచ్చాయి..#ConquerorBinduMadhavi
Also Read: క్యాష్‌తో అరియానా ఔట్, దొంగ సచ్చినోళ్లంటూ అనిల్, సునీల్‌పై ఆగ్రహం
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!
Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?
Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?