News
News
X

Dhamaka Box Office : 50 కోట్ల క్లబ్‌లో 'ధమాకా' - రవితేజ సినిమా ఐదో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Dhamaka Collection day 5 : బాక్సాఫీస్ బరిలో మాస్ మహారాజ రవితేజ 'ధమాకా'  దూకుడు చూపిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది. 

FOLLOW US: 
Share:

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా 'ధమాకా' నిలిచింది. అంతే కాదు... ఈ మధ్య కాలంలో రవితేజకు సూపర్ డూపర్ కమర్షియల్ సక్సెస్ అందించింది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో దూకుడు చూపిస్తోంది.

రవితేజ సరసన శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటించిన 'ధమాకా' (Dhamaka Movie) డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. మాస్ మహారాజా నుంచి సగటు అభిమాని, తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటారో? ఆ అంశాలన్నీ ఉన్న సినిమా! అందుకని, మొదటి రోజు విమర్శకులతో పాటు కొంత మంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ, థియేటర్లలో మాత్రం సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. వసూళ్ళ పరంగా దుమ్ము రేపుతోంది.

రూ. 50 కోట్లకు ఒక్క అడుగు దూరంలో!
'ధమాకా' సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లో ఈ సినిమా 49 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ రోజు కలెక్షన్స్ యాడ్ చేస్తే... 50 కోట్ల కంటే ఎక్కువ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

'ధమాకా' తొలి రోజు పది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వసూళ్ళలో సోమవారం సగం వస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. కానీ, 'ధమాకా' అలా కాదు... నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'ధమాకా'... నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసింది. 

ఐదో రోజు 'ధమాకా'కు ఏడు కోట్లు
'ధమాకా' సినిమా వసూళ్ళలో ఐదో రోజు పెద్దగా డ్రాప్ లేదు. ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆడియన్స్ మౌత్ టాక్ బావుండటంతో థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు. 'ధమాకా'కు ముందు ఈ ఏడాది రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఈ ఏడాది రవితేజకు విజయం వస్తుందా? లేదా? 'ధమాకా' వసూళ్ళు రవితేజ పరీక్ష పెడతాయి? వంటి మాటలు విడుదలకు ముందు వినిపించాయి. ఆ అనుమానాలు అన్నిటినీ మాస్ మహారాజా పటాపంచలు చేశారు.

Also Read : 'ఇడియట్ 2'తో హీరోగా అబ్బాయ్ ఎంట్రీ? - రవితేజ రియాక్షన్ విన్నారా?
 
View this post on Instagram
 
A post shared by People Media Factory (@peoplemediafactory)

త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన 'ధమాకా'కు బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. ఈ సినిమాకు 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది.

'ధమాకా' విజయంతో 2022కి వీడ్కోలు పలుకుతున్న రవితేజ... సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన ఆ సినిమాలో నటించారు. అది కాకుండా ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు రవితేజ. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'ఈగల్' టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఉంది. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

Also Read : చిరు, బాలయ్య పోటీ - నో ప్రాబ్లమ్, ఆల్ హ్యాపీస్!

Published at : 28 Dec 2022 09:55 AM (IST) Tags: Ravi Teja sreeleela Dhamaka Box Office Dhamaka Five Days Collection Dhamaka Collections Records

సంబంధిత కథనాలు

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

టాప్ స్టోరీస్

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి