This Is Lady Rosy Lyrical Song: వింటేజ్ ఫీల్‌తో ‘డెవిల్‘ సెకెండ్ సింగిల్- ‘థిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ ఎల్నాజ్ అందాల కనువిందు
This Is Lady Rosy Full Lyrical Song: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. వింటేజ్ ఫీల్‌తో సాగే ఈ పాట ప్రేక్షకులను చక్కగా ఆకట్టుకుంటోంది.
Devil Movie This Is Lady Rosy Full Lyrical Song: ‘బింబిసార’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా ‘డెవిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ‘మాయే చేసి’ లిరికల్ సాంగ్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ పాట సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకుంది.
ఆకట్టుకుంటున్న‘థిస్ ఇజ్ లేడీ రోజీ’ సాంగ్
తాజాగా ‘డెవిల్’ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల అయ్యింది. ‘ధిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ సాగే ఈ పాట కూడా సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ల్నాజ్ నరౌజి తన అంద చందాలతో కనువిందు చేసింది. “డాన్స్ డాన్స్ మళ్లీ కొత్తగా.. డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా.. డాన్స్ డాన్స్ థిస్ ఇజ్ లేడీ రోజీ” అంటూ హాట్ హాట్ లుక్స్ తో ఎల్నాజ్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది. ఈ పాట కూడా వింటేజ్ ఫీల్ తోనే కొనసాగింది. శ్రీ హర్ష ఈ పాటకు లిరిక్స్ అందించగా, రాజ కుమారి పాడింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వింటేజ్ ఫీల్ తో అలరించిన ‘మాయే చేసి’ సాంగ్
రీసెంట్ గా ‘మాయే చేసి’ అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు. ఈ పాట కూడా వింటేజ్ ఫీల్ తోనే కొనసాగింది. ఈ సాంగ్ కోసం ఫారిన్ మ్యూజికల్ ఇన్‌స్ట్రూమెంట్స్ వాడినట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఈ పాట కోసం సౌతాఫ్రికా నుంచి జెంబో, బొంగో, మలేషియా నుంచి డఫ్ డ్రమ్స్, చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా, దుబాయ్ నుంచి ఓషియప్, ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్ లాంటి సంగీత సాధనాలను తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వయంగా తెలిపారు.
‘డెవిల్’ సినిమా కథ ఏంటంటే?
ఇక ‘డెవిల్’ సినిమా బ్రిటీష్ కాలం నాటి కథతో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ‘డెవిల్’ ముసుగులో బ్రిటీష్ పాలకుల కోసం కల్యాణ్ రామ్ ఎందుకు పని చేశారు? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిమేఖల అనే రాజకీయ నాయకురాలిగా యంగ్ హీరోయిన్ మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నరౌజి నటించారు.
Read Also: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘జూబ్లీ’ - ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఎవరికి?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply