అన్వేషించండి

'వాల్తేరు వీరయ్య' నుంచి బిగ్ అప్డేట్, బాస్ పార్టీకి రెడీగా ఉన్నారా ?

'వాల్తేరు వీరయ్య' మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఆ అప్డేట్ ను రివీల్ చేశారు.

టాలీవుడ్ లో ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసే సినిమాల్లో మొదటి వరుసలో ఉంటుంది 'వాల్తేరు వీరయ్య' సినిమా. దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాలో చిరంజీవి లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ సినిమాలో మెగాస్టార్ పక్కా మాస్ లుక్ లో కనిపించడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా అదే లెవల్ లో విడుదల చేశారు. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఆ అప్డేట్ ను రివీల్ చేశారు. 

సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు దేవిశ్రీప్రసాద్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఇలా ట్వీట్ చేశారు  "వాల్తేరు వీరయ్య' మొదటి పాట ఇప్పుడే చూశాను. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ పాటలో చిరు చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. ఆ ఆనందంలో ముందుగానే న్యూస్ చెప్పేస్తున్నా.. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల అవుతుంది. మీరు రెడీ గా ఉండండి పాట పేరు బాస్ పార్టీ" అంటూ ట్వీట్ చేశారు దేవి. ఈ ట్వీట్ తో మెగాస్టార్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. పాట కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ను ప్రతిష్టాత్మకంగా రివీల్ చేస్తున్నారు మూవీ టీమ్. అందులో భాగంగానే ఫస్ట్ సింగిల్ సాంగ్ ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను నవంబర్ 14 న విడుదల చేస్తారు అని మొదట్లో టాక్ వచ్చింది. మరి ముందుగా అందరూ అనుకున్నట్టు నవంబర్ 14 న రిలీజ్ చేస్తారా లేదా ఈ వారంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై స్పష్టత్ రావాలి. మొత్తంగా 'వాల్తేరు వీరయ్య' లో ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేస్తుంది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా లో టైటిల్ లోగో ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ మాసివ్ లుక్ లో సినిమాలో చిరంజీవి కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే రవితేజ లుక్ ను ఇప్పటి వరకూ రివీల్ చేయలేదు మూవీ టీమ్. సినిమా సంక్రాంతి బరిలో దిగనుండడంతో ప్రమోషన్స్ కు ముందుగానే క్యారెక్టర్లను పరిచయం చేయాలని చూస్తోంది టీమ్. ప్రస్తుతం రవి తేజ లుక్ రివీల్ పై కసరత్తులు జరుగుతున్నాయట. దాదాపు 22 సంవత్సరాల తర్వాత చిరంజీవి తో కలసి నటిస్తున్నాడు రవితేజ. మరి ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి. మూవీ లో రవితేజ సరసన కేతరిన తెరిసా నటిస్తోంది. లీడ్ హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Embed widget