అన్వేషించండి

అమితాబ్ మనవరాలిపై ఫేక్ న్యూస్ - గూగుల్‌కు న్యాయస్థానం కీలక ఆదేశాలు

ఆరాధ్య బచ్చన్ గురించి డిజిటల్ మీడియా పబ్లిష్ చేస్తున్న తప్పుడు కంటెంట్ పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తనకు సంబంధించిన కంటెంట్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని గూగుల్ ను ఆదేశించింది.

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనువరాలు, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య గురించి గత కొంత కాలంగా యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ పోర్టల్స్ అసత్య వార్తలను ప్రచురిస్తున్నాయి. తన గురించి తప్పుడు వార్తలు పబ్లిష్ చేస్తున్న సదరు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ చిన్నారి తండ్రి అభిషేక్ బచ్చన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం తప్పుడు వార్తలను తప్పుబట్టింది. ‘తీవ్ర అనారోగ్యంతో ఉంది’,  ‘ఇక లేరు’ అంటూ ఆరాధ్య గురించి పబ్లిష్ చేసిన కంటెంట్ ను వెంటనే తొలగించాలని టెక్ దిగ్గజం గూగుల్ ను ఆదేశించింది.  

పలు యూట్యూబ్ ఛానెల్స్ పై నిషేధం విధించిన న్యాయస్థానం

ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుదారి పట్టించే కంటెంట్‌ను ప్రచురిస్తున్న పలు  యూట్యూబ్ ఛానెల్స్ పై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అనారోగ్యమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రతి బిడ్డను గౌరవంగా చూడాలని జస్టిస్ సి హరి శంకర్ అభిప్రాయపడ్డారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం   పూర్తిగా సహించరాని విషయంగా ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరాధ్యకు సంబంధించిన కంటెంట్ తొలగించాలని గూగుల్ కు ఆదేశం

అటు కోర్టు, మధ్యంతర ఉత్తర్వులో, సందేహాస్పద అప్‌లోడర్ల వివరాలను తెలియజేయాలని గూగుల్‌ ని ఆదేశించింది. ఇలాంటి వీడియోలు, Google దృష్టికి వచ్చినప్పుడల్లా తీసివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 1 నుంచి 9 వరకు ఉన్న ప్రతివాదులు (YouTube ఛానెల్స్) ఆరాధ్య ఆరోగ్య స్థితి, శారీరక స్థితికి సంబంధించి నెట్‌ తో పాటు పబ్లిక్ ప్లాట్‌ ఫారమ్‌లో కంటెంట్‌ను ప్రచురించడంపై ఇక నుంచి నిషేధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాది సంఖ్య 10 (గూగుల్) వెంటనే డిలిస్ట్ చేసి, ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను డియాక్టివేట్ చేస్తుంది" అని పేర్కొంది.

చిన్న పిల్లల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం సరికాదు

చిన్న  పిల్లల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అనారోగ్యమైన వక్రబుద్ధి గా న్యాయ స్థానం అభిప్రాయపడింది. పిల్లల ప్రయోజనాలలో పూర్తి ఉదాసీనతను  ప్రతిబింబిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. మధ్యవర్తి నిబంధనలను దృష్టిలో ఉంచుకుని యూట్యూబ్ ప్లాట్‌ ఫారమ్‌ లో ఇటువంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ తో  వ్యవహరించే విధానాన్ని వివరంగా పేర్కొంటూ ప్రతిస్పందనను దాఖలు చేయాలని కోర్టు Googleను ఆదేశించింది.  సందేహాస్పద కంటెంట్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మధ్యవర్తుల కోసం చట్టపరమైన ఫ్రేమ్‌ వర్క్‌ ను అనుసరించడానికి Google బాధ్యత వహిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది.

గత కొద్ది కాలంగా నెగెటివ్ వార్తలు  

ఢిల్లీకి చెందిన చెందిన యూట్యూబ్ ఛానెళ్లు, టాబ్లాయిడ్స్ గత కొద్ది రోజులుగా ఆరాధ్య గురించి వరుస కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే, వాటిలో వాస్తవాల కంటే ఊహాగానాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమ్మాయి ఆరోగ్యంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు కథనాలు ప్రచురించారు. వాటిపై బిగ్ బీ ఫ్యామిలీ సీరియస్ అయ్యింది. తప్పుడు వార్తలు జనాల్లోకి తీసుకెళ్తున్న సంస్థలపై  చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అందుకే, చిన్నారి ఆరాధ్యతో ఢిల్లీ కోర్టులో కేసు వేయించారు. తప్పుడు వార్తలకు అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసు వేసినట్లు బిగ్ బీ ఫ్యామిలీ న్యాయవాదులు వెల్లడించారు.

Read Also: కోర్టు మెట్లెక్కిన బిగ్ బీ మనువరాలు, వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Kollywood: తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Embed widget