Yemaiundacho: 'ఏమైవుండొచ్చో' డిలీటెడ్ సీన్స్: అయ్యో, ఇంత మంచి సీన్స్ ఎందుకు తీసేశారో!
'ఏమైవుండొచ్చో' డిలీట్ చేసిన కొన్ని సీన్లు, ఫీమేల్ వెర్షన్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ వెర్షన్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునయన షార్ట్ ఫిలిమ్స్, స్పెషల్ ఆల్బమ్స్ అంటూ బిజీగా గడుపుతోంది. గతంలో ఆమె 'మలుపు', 'తట్టుకోలేదే' అనే బ్రేకప్ సాంగ్స్ లో నటించింది. తాజాగా 'ఏమైవుండచ్చో' అనే పాటలో నటించింది. ఈ పాటను 'సోనీ మ్యూజిక్ సౌత్' స్వయంగా తమ యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేసింది. వినయ్ షన్ముక్ దర్శకత్వంలో రూపొందించిన ఈ ఆల్బమ్ సాంగ్ రీసెంట్ గానే విడుదలైంది.
విజయ్ బాల్గానిన్ ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు పాడాడు కూడా. ఇందులో దీప్తి సునయనకు జోడిగా సుగి విజయ్ నటించాడు. అతడి ప్రియురాలిగా దివ్య నటించింది. ఈ పాటకి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ఈ పాటలో డిలీట్ చేసిన కొన్ని సీన్లు, ఫీమేల్ వెర్షన్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ వెర్షన్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ గనుక ఒరిజనల్ తో మిక్స్ అయి ఉంటే సాంగ్ మరో రేంజ్ లో ఉండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
''మనసు మనసుకి మధ్య ఎంత దూరమున్న ఆ దూరం పేరు కూడా ప్రేమనుకో.. పగిలి మిగిలిన జ్ఞాపకాలు గుచ్చుకున్న ఆ గాయాలన్ని కూడా ప్రేమనుకో.. పక్కనే ఉంటేనే ప్రేమంటే.. లేకుంటే సంతోషం లేదంటే.. లోకాన ఏ ఒక్క మనసుకి ఏ చిన్న నవ్వయిన దొరకదులే'' అంటూ సాగే ఈ పాటకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

