By: ABP Desam | Updated at : 31 Mar 2023 01:54 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Nani/Instagram
నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘దసరా’. నాని కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీ చేశారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అని నాని పలు నగరాలు తిరిగి ప్రచారం చేశారు. తొలి రోజు సినిమాకు మంచి స్పందన లభించింది. కలెక్షన్స్ కూడా బావున్నాయి. ఈ సినిమాపై ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందు నుంచే ఓరేంజిలో హైప్ క్రియేట్ చేయడంతో, భారీ అంచనాలు నెలకొన్నాయి. వారి అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా థియేటర్లలో ధూమ్ ధామ్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ‘దసరా’ ధూమ్ ధామ్
కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు భారీగా కలెక్షన్లు సాధించింది. సంక్రాతికి వచ్చిన సినిమాల కలెక్షన్లతో పోల్చితే ‘దసరా’ సినిమా దుమ్మురేపిందని చెప్పుకోవచ్చు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ తొలి రోజు కలెక్షన్లు మించి సాధించింది. 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయలు రాగా, 'వీర సింహా రెడ్డి' సినిమా రూ. 6.10 షేర్ కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల కంటే కంటే కంటే అర కోటి ఎక్కువ కలెక్ట్ చేసింది నాని 'దసరా'. ఈ సినిమాకు నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల షేర్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దసరా' సినిమా మొదటి రోజు సుమారు రూ. 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా రూ. 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
నాని చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ ఓపెనింగ్!
ఇక ఓవర్సీస్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘దసరా’ మొదటి రోజు (ప్రీమియర్‌లతో సహా) మొత్తం $850K కలెక్ట్ చేసి US బాక్సాఫీస్ సంచనలం కలిగించింది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ఎలైట్ $1 మిలియన్ క్లబ్‌లో చేరనుంది. ఇప్పటి వరకు నాని చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ ఓపెనింగ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. నార్త్ ఇండియాలో మొదటి రోజు 'దసరా'కు 40 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
Also Read : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా
ఎస్‌ఎల్‌వి సినిమాస్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ధీక్షిత్ శెట్టి, సాయి కుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
Read Also: లాస్ ఏంజెల్స్ అవార్డు వేడుకలో సత్తా చాటిన ‘బలగం‘, రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు
Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?
Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?
Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి
KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!
తమన్నా రొమాంటిక్ వెబ్ సీరిస్ ‘జీ కర్దా’ ట్రైలర్ - బెస్ట్ ఫ్రెండ్స్ ప్రేమికులైతే?