Das ka Dhamki: బాలయ్య చేతుల మీదుగా 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ రిలీజ్, విశ్వక్ సేన్ మళ్ళీ ఇచ్చిపడేశాడుగా!
విశ్వక్ సేన్ నుంచి మళ్లీ మాస్ మూవీ వచ్చేస్తుంది. అదే విశ్వక్ తాజాగా నటించిన 'దాస్ కా ధమ్కీ'. సినిమా ట్రైలర్‌ను శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ చేసింది మూవీ టీమ్.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. 'ఫలక్ నుమా దాస్' సినిమాతో మంచి హిట్ అందుకొని ‘మాస్ కా దాస్’గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కేవలం మాస్ చిత్రాలే కాకుండా థ్రిల్లర్, లవ్, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే విశ్వక్ సేన్ నుంచి మళ్లీ మాస్ మూవీ వచ్చేస్తోంది. అదే విశ్వక్ తాజాగా నటించిన 'దాస్ కా ధమ్కీ'.
ఈ సినిమాకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. సినిమా ట్రైలర్‌ను శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ చేసింది మూవీ టీమ్. నటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా చాలా రిచ్ గా తీశారని అర్థమవుతుంది. "ఆరేళ్ళ వయసున్న కంపెనీ, 10 వేల కోట్ల టర్నోవర్.. ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేట్ లో పడిపోయాయి. సాయానికి ఒక్క గడ్డిపూచైనా దొరక్క పోతుందా? ఆదుకునే ఒక్క మనిషైనా ఉండకపోతాడా" అంటూ రావ్ రమేష్ డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. దీనికి కొనసాగింపుగా "రెడీ సర్" అంటూ విశ్వక్ వెయిటర్ గా స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తాడు.
వెయిటర్ గా ఉండగానే హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆమెతో లవ్ ట్రాక్, స్నేహితులు, పార్టీలతో సరదాగా సాగిపోతున్న హీరో లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. వేల కోట్ల కంపెనీని కాపాడే బాధ్యత హీరోపై పడుతుంది. ఇంతకీ వెయిటర్ కు ఆ కంపెనీకి సంబంధం ఏంటి ? అసలు వెయిటర్ బ్యాగ్రౌండ్ ఏంటి ? ఆ కంపెనీ ఏం చేస్తుంది ? ఎందుకు మూతపడుతుంది ? అక్కడికి వెళ్ళాక విశ్వక్ ఏం చేశాడు ? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
కార్పొరేట్ కంపెనీల్లో ఉండే కుట్ర రాజకీయాలు, లవ్, కామెడీ, హీరో ఎలివేషన్స్, ఫైట్స్ ఇలా అన్ని కలగలిపితే ‘దాస్ కా ధమ్కీ’ అనేలా ఉంది ట్రైలర్. ఇందులో విశ్వక్ డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క ఈ సినిమాలో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కనిపించనుంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది. విశ్వక్ నుంచి కోరుకునే కొన్ని మాస్ డైలాగ్స్ కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే ఇంతకముందే చూసిన స్టోరిలా అనిపిస్తున్నా.. విశ్వక్ ఏదో ఒక ట్విస్ట్ పెట్టాడేమో చూడాలి. ఆ మ్యాజిక్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
విశ్వక్ సేన్ కు తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా విశ్వక్ తన యాటిట్యూడ్ తో అందర్నీ ఆకట్టుకుంటాడు. సినిమా సినిమాకు వెరీయేషన్ చూపిస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. రీసెంట్ గా 'ఓరి దేవుడా' సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ విశ్వక్ సేన్ దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించారు. తన సొంత బ్యానర్‌పై తండ్రి కరాటే రాజు నిర్మించారు. ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదల కానుంది.
Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!