By: ABP Desam | Updated at : 07 Dec 2022 11:25 AM (IST)
Edited By: Mani kumar
RGV - Ashu Reddy
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సెన్సేషనల్ అవుతుంది. తన వ్యాఖ్యలతో నిత్యం ఏదొక వివాదం సృష్టిస్తూ ఉంటారు వర్మ. తాజాగా వర్మ పాల్గొన్న ఓ ఇంటర్య్వూ లో ఆయన చేష్టలు మరో కాంట్రవర్సీకి తెరతీశాయి. ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ అనే సినిమాను తీశారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను ఆర్జీవి భారీగానే ప్లాన్ చేశారు. టీవీ స్టార్ అషురెడ్డితో ఓ ఇంటర్వ్యూ ను చేశారు. అందులో అషురెడ్డి షార్ట్ డ్రెస్ లో సోఫాలో కూర్చొని ఉండగా ఆర్జీవి ఆమెకు ఎదురుగా నేల పై ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడీ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్య్వూ లో ‘డేంజరస్’ సినిమా గురించి అషురెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆర్జీవి తన స్టైల్ లో సమాధానాలు చెప్పారు. అయితే మొదట్లో అషురెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొవడానికి వర్మ చెప్పిన రీజన్ చాలా విచిత్రంగా ఉంది. అదేంటంటే.. గతంలో అషురెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేసింది. అది కూడా చాలా కాంట్రవెర్సీ అయింది. అందులో ఓ సందర్భంలో ఆర్జీవీ ను చెంప పై కొడుతుంది అషురెడ్డి. ఆ ప్రోగ్రాం తర్వాత కొంతమంది సన్నిహితులు ఓ అమ్మాయి చేతిలో దెబ్బలు తినడం ఏంటీ, అలా ఎలా చేశారు అని రకరకాల ప్రశ్నలు వర్మను అడిగారట.
ఆ విషయం గురించి చెప్తూ.. అమ్మాయిల విషయంలో వాళ్లకి క్లారిటీ లేదని, ఎంత గొప్ప వీరుడైనా కాంతా దాసుడే అనే సత్యాన్ని వాళ్లందరికీ తెలిసేలా చేయడం కోసమే ఇలా అషు కాళ్ళ ముందు కూర్చున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇంటర్వ్యూలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో పక్కన పెడితే.. ఇంటర్వ్యూ చివర్లో పెద్ద షాక్ ఇచ్చారు ఆర్జీవి. అషురెడ్డితో.. నీ పాదాలను ముద్దు పెట్టుకోవాలని ఉందని, ఆ వరప్రసాదం తనకు ఇవ్వాలని కోరారు. తనకు ఆ అవకాశం ఇవ్వకపోతే చనిపోయే ముందు చాలా బాధపడుతూ చనిపోతానని, అందుకే తన కోరిక తీర్చాలని కోరారు. దానికి అషురెడ్డి సమాధానం చెప్తూ.. “ఇంతసేపు నా పాదాలు దగ్గర ఓ భక్తుడిలా కూర్చొని నన్ను దేవతల ట్రీట్ చేశావ్, నీ కోరిక తీర్చకుండా ఉంటానా” అంటూ బదులిచ్చింది. దీంతో ఆర్జీవి అషురెడ్డి పాదాలను ముద్దాడారు. తర్వాత అషురెడ్డి కొత్త మూవీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆర్జీవి కు ఓ కిస్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఆర్జీవి కు ఇలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ లు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి కాంట్రవెర్సీకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు వర్మ. మళ్లీ ఇప్పుడు అషురెడ్డితో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరోసారి చర్చనీయాంశమయ్యారు ఆర్జీవి. ఇక ‘డేంజరస్’ మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?
Upcoming Movies This Week: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!
Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?
Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్
Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!