![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
ఓటీటీలోకి రాబోతున్న నాగ చైతన్య 'కస్టడీ' - ఎప్పటి నుంచంటే..
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య, కృతి శెట్టిలు జంటగా నటించిన 'కస్టడీ' ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందంటూ ప్రైమ్ వీడియోస్ అధికారికంగా వెల్లడించింది.
![ఓటీటీలోకి రాబోతున్న నాగ చైతన్య 'కస్టడీ' - ఎప్పటి నుంచంటే.. Custody OTT Release: Naga Chaitanya and Krithi Shetty's Thriller to Stream on Prime Video From June 9 ఓటీటీలోకి రాబోతున్న నాగ చైతన్య 'కస్టడీ' - ఎప్పటి నుంచంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/2b6ecfffb275f360a9881f861e0b9fd51686129200084697_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Custody OTT Release: టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు జంటగా నటించిన 'కస్టడీ' చిత్రం త్వరలో ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా జూన్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ చిత్రం మే 2023లో థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ మూవీలో అరవింద్ స్వామి, ప్రియమణి, ఆర్ శరత్‌కుమార్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.
అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'కస్టడీ' సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మే 12న థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. అనుకున్న స్థాయిలో అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓ అప్ డేట్ ఇచ్చింది. కస్టడీని జూన్ 9నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
embark on a heart-pounding journey with constable Siva as he works his way through a web of corruption, betrayal, and lies! 👮♂#CustodyOnPrime, June 9 pic.twitter.com/oosDXGXjE8
— prime video IN (@PrimeVideoIN) June 7, 2023
ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఓ అనౌన్సమెంట్ ద్వారా అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రం ఒరిజినల్ తెలుగు, తమిళ్ సహా మళయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాగా.. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయ్యినవారు జూన్ 9 నుంచి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
కథేంటంటే..
'కస్టడీ' సినిమాలో శివ అనే పోలీస్ కానిస్టేబుల్‌గా నాగచైతన్య కనిపించాడు. ముఖ్యమంత్రి అండతో ఎన్నో నేరాలకు పాల్పడిన రాజు అనే క్రిమినల్‌ను కోర్టులో హాజరుపరిచే బాధ్యతను చేపట్టిన ఓ కానిస్టేబుల్‌కు ఎదురైన సంఘటనలతో వెంకట్ ప్రభు యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా ఎంగేజింగ్‌గా చెప్పడంలో తడబడటంతో కస్టడీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది.
అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్ కీలక పాత్రలను పోషించిన ఈ సినిమాలో.. కోలీవుడ్‌లో పాగా వేయాలన్న నాగచైతన్య ఆశలు అంతగా ఫలించలేదు. దాదాపు ఇరవై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ పది కోట్లు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. నిర్మాతకు భారీగా నష్టాలను మిగిల్చింది.
'ఏజెంట్' కంటే ముందుగానే..
ఇక హీరో అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమాకు ముందుగానే కస్టడీ ఓటీటీలోకి రాబోతుంది. 'కస్టడీ' కంటే ముందుగానే ఏజెంట్ రిలీజైనా.. 'కస్టడీ' సినిమానే ముందుగా స్ట్రీమింగ్ కాబోతుండడం గమనార్హం. ఏప్రిల్ 28న 'ఏజెంట్' థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అనేలా డేట్ ప్రకటించారు కానీ.. ఆ డేట్‌కి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా జూన్ 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
Read Also : ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)