Raju Srivastav Death: గుండెపోటుతో చికిత్స పొందుతూ ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. గుండెపోటుతో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
![Raju Srivastav Death: గుండెపోటుతో చికిత్స పొందుతూ ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family. Raju Srivastav Death: గుండెపోటుతో చికిత్స పొందుతూ ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/33e315fe11a1f1e75e0e1ffc21625aa91663739674783239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్, ప్రముఖ నటుడు రాజు శ్రీవాత్సవ (Raju Srivastava) కన్నుమూశారు. గుండెపోటుతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయన కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు రాజు శ్రీవాస్తవ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆగష్టు 10న రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ వచ్చింది. సౌత్ ఢిల్లీలోని కల్ట్ జిమ్ లో థ్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. మొదట్లో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత నెమ్మదిగా అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు అతడిని ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. నెమ్మదిగా అతడి బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ ఆయన స్నేహితుడు, కమెడియన్ సునీల్ పాల్ తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. ఇంతలోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.
— ANI (@ANI) September 21, 2022
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.
(File Pic) pic.twitter.com/kJqPvOskb5
రాజు శ్రీవాత్సవ వయసు 58 సంవత్సరాలు. గతంలో ఒకసారి గుండె సంబంధ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు అప్పట్లో తనకు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆగష్టు 10న తీవ్ర స్థాయిలో ఆయనకు గుండె పోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయను ఎయిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. అయితే, రాను రాను ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ వచ్చింది. తొలుత అవుటాఫ్ డేంజర్ అని వైద్యులు చెప్పినా.. ఆయన కోలుకోలేకపోయారు. చివరకు చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.
రాజు శ్రీవాత్సవ అంటే... ప్రేక్షకులకు స్టాండప్ కామెడీ షోస్ ఎక్కువ గుర్తుకు వస్తాయి. టైమింగ్‌తో ఆయన వేసే జోక్స్, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అటువంటి సందర్భాలు ఉన్నాయని కనెక్ట్ అయ్యేలా ఆయన చేసే కామెడీకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. స్టాండప్ కామెడీ టాలెంట్ హంట్ షో 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'తో రాజు శ్రీవాత్సవ వెలుగులోకి వచ్చారు.
హిందీ సినిమాల్లో కూడా రాజు శ్రీవాత్సవ నటించారు. హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ నటించిన 'మై ప్రేమ్ కి దివాన్ హూ'తో సహా కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. సినిమాల కంటే స్టాండప్ కామెడీ షోస్ ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చాయి. ఇటీవల వరుసగా సినీ ప్రముఖులకు హార్ట్ ఎటాక్ రావడంతో పరిశ్రమలోని పలువురు ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ వహించాలని అనుకుంటున్నారు.
Also Read : ఇండియా నుంచి ఆస్కార్ బరిలో గుజరాతీ సినిమా - ఆర్ఆర్ఆర్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు!
Also Read : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పోస్ట్ చేశారు చూశారా? మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)