Yazin Nizar Latest Telugu Song : నా మనసు నిన్ను చేర - చిన్న సినిమాలో యాజిన్ నిజార్ పాట
ప్రముఖ గాయకుడు యాజిన్ నిజార్ చిన్న తెలుగు సినిమాలో ఓ పాట పాడారు. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
గాయకుడు యాజిన్ నిజార్ (Yazin Nizar) పేరును తెలుగు ప్రేక్షకులు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. లేదంటే ఆయన పాడిన పాటల్ని అయినా సరే తప్పకుండా విని ఉంటారు. మహేష్ బాబు 'శ్రీమంతుడు'లో చారుశీల, అల్లు ర్జున్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో శీతాకాలం, 'కుమారి 21ఎఫ్'లో మేఘాలు లేకున్నా, 'ఉప్పెన'లో రంగులద్దుకున్న, 'సీతా రామం'లో ఎపుడో నిన్ను... ఇలా చెబుతూ వెళితే యాజిన్ నిజార్ పాడిన హిట్ పాటలు ఎన్నో ఉన్నాయి! ఇప్పుడు ఆయన ఓ చిన్న సినిమాలో పాట పాడారు.
'నచ్చినవాడు'లో యాజిన్ నిజార్ పాట!
లక్ష్మణ్ చిన్నా (Laxman Chinna) కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నచ్చినవాడు'. కావ్య రమేష్ కథానాయిక. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై వెంకట రత్నంతో కలిసి లక్ష్మణ్ చిన్నా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాటను యాజిన్ నిజార్ ఆలపించారు.
''నా మనసు నిన్ను చేర...
దూర తీరం సాగుతోంది!
నేడు నిన్ను చేరుకోగ...
పరుగు తీయ సిద్ధమైంది!
ఈ చిలిపి ఊహ నాలో...
రేపుతోంది కొత్త ఆశ కొత్తగా''
అంటూ సాగిన ఈ గీతానికి మిజో జోసెఫ్ బాణీ అందించారు. ఈ పాటను హర్షవర్ధన్ రెడ్డి రాశారు. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో ఈ మధ్య సాంగ్ విడుదల అయ్యింది. యాజిన్ నిజార్ పాడిన తీరు, లవ్లీ మాస్ బీట్ నంబర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read : ఫ్యాన్ మేడ్ పోస్టర్లు బెటర్, 'ఐరన్ మ్యాన్'ను కాపీ కొడతారా? - ప్రభాస్ లుక్కుపై మీమ్స్
'నా మనసు నిన్ను చేర...' (Na Manasu Ninnu Chera Song) సాంగ్ విడుదలైన సందర్భంగా హీరో & దర్శక, నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ "మహిళల స్వీయ గౌరవం, ఆత్మాభిమానం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. స్త్రీ గౌరవానికి తోడు సినిమాలో చక్కటి ప్రేమకథ, సున్నితమైన హాస్యం ఉంటాయి. యువత కోరుకునే అంశాలు, వాళ్ళకు కావాల్సిన కథాంశం సినిమాలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కర్ణాటక, పాండిచ్చేరిలోని వివిధ అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరించాం. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు... ముఖ్యంగా యువతకు సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది'' అని అన్నారు.
Also Read : త్రివిక్రమ్ కథతో రానా 'హిరణ్యకశ్యప' - హాలీవుడ్ గడ్డపై ప్రకటన
లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్ జంటగా నటించిన ఈ సినిమాలో కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి.ఆర్.పి. రెడ్డి, ప్రవీణ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్, కలరిస్ట్ : ఆర్. గోపాల కృష్ణన్, కళా దర్శకత్వం : నగేష్, గగన్, ఛాయాగ్రహణం : అనిరుద్, కూర్పు : కె.ఎ.వై. పాపారావు, కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్, పాటలు : హర్షవర్ధన్ రెడ్డి, సంగీతం : మెజ్జో జోసెఫ్, నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా & వెంకట రత్నం, కథ - కథనం - దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial