అన్వేషించండి

Yash: అభిమానం చూపించే పద్ధతి ఇది కాదు - ఫ్యాన్స్ మృతిపై యాశ్ ఆవేదన

Yash Birthday: తాజాగా రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు కట్టి సెలబ్రేట్ చేసుకుందామని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అదే ప్రమాదంలో ముగ్గురు ఫ్యాన్స్ మరణించారు. దానిపై యశ్ స్పందించాడు.

Yash Reaction on Fans Death: తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్సే ముందుగా ఎక్కువ ఎగ్జైట్ అవుతుంటారు. వారి పుట్టినరోజును ఒక పండగలాగా చేస్తారు. అందుకే తాజాగా కన్నడ స్టార్ హీరో యశ్ పుట్టినరోజు వేడుకలను కూడా అదే విధంగా ఘనంగా చేయాలనుకున్నారు ఫ్యాన్స్. కానీ అనుకోని విధంగా ఆ వేడుకల్లో అపశృతి జరిగింది. యశ్ బర్త్ డే సందర్భంగా కర్ణాటకలోని సురంగి అనే గ్రామానికి చెందిన ముగ్గురు అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేయడంలో పాల్గొన్నారు. అదే క్రమంలో కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. మరో ముగ్గురు ఫ్యాన్స్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయంపై యశ్ స్పందించాడు. అంతే కాకుండా తన ఆసుప్రతిలో ఉన్న తన ఫ్యాన్స్‌ను స్వయంగా వెళ్లి కలిశాడు.

పుట్టినరోజు అంటేనే భయమేస్తుంది..
తన బ్యానర్ కడుతూ మృతిచెందిన ఫ్యాన్స్ కుటుంబాలను యశ్ వెళ్లి కలిశాడు. అంతే కాకుండా ఆసుపత్రిలో ఉన్న ఫ్యాన్స్‌ను కూడా వెళ్లి చూసి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈ ఘటనపై స్పందించాడు యశ్. ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నా తనకు మనస్ఫూర్తిగా విష్ చేస్తే చాలు అని, అదే తనకు పెద్ద విషయమని యశ్ అన్నాడు. ‘‘ఇలాంటి ఘటలను చూస్తుంటే నా పుట్టినరోజు అంటే నాకు భయమేస్తుంది. ఫ్యాన్‌డమ్‌ను చూపించే పద్ధతి ఇది కాదు. మీ ప్రేమను ఇలా మాత్రం చూపించకండి ప్లీజ్. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. బ్యానర్లు కట్టకండి, భయంకరమైన బైక్ రేసులు చేయకండి, సెల్ఫీల కోసం రిస్కులు తీసుకోకండి. నేను ఎలా జీవితంలో ఎదిగానో.. నా ఫ్యాన్స్ కూడా అలాగే ఎదగాలని నా కోరిక’’ అని ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసుకున్నాడు యశ్.

కోవిడ్ వల్లే..
ఫ్యాన్స్ అంతా సంతోషంగా ఎలో ఉండాలి, ఎలా సక్సెస్‌ఫుల్ అవ్వాలి అనే విషయాలపై దృష్టిపెట్టాలని కోరాడు యశ్. దాంతో పాటు కుటుంబానికి గర్వపడేలా చేయాలని అన్నాడు. తన పాపులారిటీని చూపించుకోవడానికి తన ఫ్యాన్స్ ప్రేమను అడ్డం పెట్టుకోవడం తనకు ఎప్పుడూ నచ్చదని, ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా.. మినిమమ్ ఉంచడానికి ట్రై చేస్తానని తెలిపాడు. ‘‘కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈ ఏడాది నేను నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోకూడదని అనుకున్నాను. మా తరపున ఎలాంటి ప్రమాదం జరగకూడదు. అందుకే ఈసారి సింపుల్‌గా కేవలం కుటుంబంతో కలిసి నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాను’’ అని యశ్ బయటపెట్టాడు.

కమిట్‌మెంట్స్‌తో బిజీ..
తన పుట్టినరోజున బ్యానర్లు కడుతూ మరణించిన, గాయాలపాలైన ఫ్యాన్స్‌కు ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు యశ్. ‘కేజీఎఫ్’ సినిమాతో రాకింగ్ స్టార్‌గా దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు యశ్. ప్రస్తుతం తనకు కేవలం కన్నడలోనే కాదు.. ఇతర సౌత్ భాషల్లో, హిందీలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌ను తృప్తిపరిచే విధంగా తన తరువాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు యశ్. ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ముందుగానే కమిట్‌మెంట్స్ ఉండడం వల్ల ఈసారి పుట్టినరోజుకు తన ఫ్యాన్స్‌ను కలవలేకపోతున్నానని తన బర్త్ డే కంటే ముందే ప్రకటించాడు యశ్.

Also Read: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
Embed widget