Kalki 2898 AD: అప్పుడు ‘పాన్ ఇండియా’.. మరి ఇప్పుడు 'కల్కి'తో ప్రభాస్ 'పాన్ వరల్డ్'కు బాటలు వేస్తాడా?
Kalki 2898 AD: 'బాహుబలి'తో తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు 'కల్కి 2898 AD' మూవీతో వస్తున్నారు. దీంతో హాలీవుడ్ మార్కెట్ కు బాటలు వేస్తారా? అనే చర్చ మొదలైంది.
Kalki 2898 AD: తెలుగు సినిమాకు 'పాన్ ఇండియా' దారి చూపించిన దర్శక హీరోలు ఎస్.ఎస్ రాజమౌళి & రెబల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి: ది కన్క్లూజన్' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని, భాషా ప్రాంతీయత అడ్డంకులను చెరిపేసారు. దీంతో టాలీవుడ్ నుండి చాలా మంది స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి సారించారు. తమ చిత్రాలను అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ రిలీజ్ చేయడం ప్రారంభించారు. టైర్-2 హీరోలు సైతం మల్టీలాంగ్వేజెస్ లో తమ మార్కెట్ ను విస్తరించుకునే పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీతో వస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని, వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సి. అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది జూన్ 27న థియేటర్లలోకి రాబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్ ఉన్న కంటెంట్ కావడంతో, ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటుగా పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రెబల్ స్టార్ సెన్సేషనల్ సక్సెస్ సాధించి, పాన్ వరల్డ్ కు బాటలు వేస్తారా? అనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 'బాహుబలి' ఫ్రాంచైజీ వెనుక ఎస్.ఎస్ రాజమౌళి లాంటి దర్శక ధీరుడు ఉన్నారు. ఆయన ఎంత కష్టపడి సినిమా తీస్తారో, అదే స్థాయిలో దాన్ని మార్కెటింగ్ చేసుకుంటారు. ఆ విధంగానే ప్రభాస్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లి, బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టారు. ఆ తర్వాత RRR చిత్రంతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి, ఆస్కార్ అవార్డ్ కూడా సాధించారు. అలా అని 'కల్కి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తోనే తాను ఎలాంటి సినిమాతో రాబోతున్నారో శాంపిల్ గా జనాలకు చూపించారు.
హిందూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా ఓ ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ సినిమాగా 'కల్కి 2898 AD' ని తీర్చిదిద్దుతున్నారు నాగ్ అశ్విన్. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో చూపించే క్రమంలో ఓ ఊహాజనిత ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇది మహాభారతం కాలం నుంచి క్రీ.శ. 2898 మధ్య జరిగే 6000 సంవత్సరాల కథను చూపిస్తుందని, దీంట్లో ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టూ ఉంటాయని తెలిపారు.
ఇక 'కల్కి' సినిమా ఇండియా రూపు రేఖలు మారుస్తుందని.. ఇండియాకి ఎవెంజర్స్ లాంటి చిత్రమని ఇటీవల రానా దగ్గుబాటి హైప్ ఎక్కిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే శాన్ డియాగో కామిక్ కాన్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రమోషన్స్ చేయడం ద్వారా ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ తో పాటుగా దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ భాగమయ్యారు. ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. కాబట్టి ప్రాజెక్ట్-కె కంటెంట్ జనాలు నచ్చితే మాత్రం గ్లోబల్ వైడ్ గా రీచ్ ఉండే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ప్రభాస్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారంటీ అని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
Also Read: తీరిక లేకుండా గడుపుతున్న టాలీవుడ్ స్టార్స్!