అన్వేషించండి

Deepika Padukone : దీపికా బయలుదేరమ్మా ఇక అని ఎందుకంటున్నారు? మొన్న స్పిరిట్, ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్..మరి అట్లీ మూవీ?

Deepika Dropped From Kalki 2898 AD Sequel : దీపికా పదుకొనే కల్కి 2898 AD సీక్వెల్లో నటించడం లేదనే క్లారిటీ వచ్చేసింది. స్పరిట్, కల్కి తర్వాత అట్లీ మూవీ? ఇక్కడ ట్రబుల్ మేకర్ ఈమెనా?

 Deepika Padukone

మొన్న సందీప్ రెడ్డి వంగా మూవీ స్పిరిట్ నుంచి ఔట్

ఇప్పుడు నాగ్ అశ్విన్ కల్కి 2898AD సీక్వెల్ నుంచి ఔట్

సందీప్ తప్పుచేశారా? దీపికా కారణమా అని పెద్ద చర్చే జరిగింది

కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ చెప్పిందా?

కల్కి 2898 ADకి సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందనే సమయంలో దీపికా ఈమూవీలో నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.  నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఆమె తప్పుకున్నట్లు ధృవీకరించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ మేరకు Xలో అధికారిక పోస్ట్ చేస్తూ, నిర్మాతలు ఇలా ప్రకటించారు.  “@deepikapadukone #Kalki2898AD రాబోయే సీక్వెల్‌లో భాగం కాదు అని అధికారికంగా ప్రకటిస్తున్నాం అంటూ పట్టిన పోస్ట్ లో తీవ్రమైన స్వరమే వినిపించింది.  @Kalki2898AD వంటి సినిమాకు  నిబద్ధత చాలా అవసరం అని అందులో స్పష్టం చేశారు.  

షెడ్యూల్ సమస్య

ఓ నివేదిక ప్రకారం, దీపికా బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ సమస్య వచ్చిందని తెలిసింది. మరో సోర్స్ ప్రకారం, “ఈ సంవత్సరం చివరిలో సీక్వెల్ షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే  ఇప్పటికే దీపికా ఆ సమయంలో  డేట్స్ అన్నీ దర్శకుడు అట్లీతో చేస్తున్న సినిమాకు కేటాయించారు.  దాదాపు రెండు సినిమాల షూటింగ్ఒ కే సమయంలో జరగాల్సి రావడంతో నిర్మాతలు - దీపికా టీమ్‌ మధ్య సమస్యలు తలెత్తాయి.”

దీపికా పదుకొనే తప్పుకోవడానికి  ఇతర కారణాలు

బాలీవుడ్ హంగామా ప్రకారం... డబ్బు, పని పరిస్థితులు కూడా సమస్యలుగా మారాయి. నిర్మాతలకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి బాలీవుడ్ హంగామాతో మాట్లాడుతూ, “సినిమా మొదటి భాగంలో ఆమె తీసుకున్న ఫీజులో 25 శాతం పెంపును దీపికా డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని తేల్చి చెప్పింది. కల్కి 2898 AD VFXతో కూడిన సినిమా కావడంతో, తక్కువ సమయంలో షూటింగ్ చేస్తే బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ గంటలు షూటింగ్ చేయడానికి వీలుగా దీపికా కోసం లగ్జరీ వ్యానిటీని ఏర్పాటు చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు, కానీ ఆమె నిరాకరించింది. ప్రభాస్ కూడా తన ఫీజు పెంచమని అడగలేదు.. కాబట్టి ఆర్థిక విషయాలపై కూడా చర్చలు జరిపారు.”

 పైగా “దీపికా టీమ్‌లో దాదాపు 25 మంది ఉన్నారు, వీరంతా ఆమెతో పాటు షూటింగ్‌కు వస్తారు. ఆమె బృందం కోసం ఫైవ్ స్టార్ వసతి, భోజనం ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. నటి ఫీజుతో పాటు, ఆమె బృందం కోసం వసతి, భోజనం కోసం నిర్మాతలు ఎందుకు చెల్లించాలి? చాలా మంది హిందీ నిర్మాతలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.” నిర్మాతలు పునరాలోచించమని కోరినప్పటికీ, ఆమె బృందం వెనక్కి తగ్గలేదని ఆ నివేదిక పేర్కొంది. అప్పుడే ఆమెను సినిమా నుంచి తప్పించడమే మంచిదనే నిర్ణయం తీసుకున్నారు.

అభిమానుల స్పందన

కల్కి 2898 AD దీపికా నటించడం లేదనే వార్త సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ కి తావిచ్చింది.  చాలా మంది నిరాశ వ్యక్తం చేయగా, మరికొందరు తెర వెనుక ఏం జరిగిందోనని ఊహాగానాల్లో ఉన్నారు.  “దీపికా అభిమానుల నుంచి నాగ్‌ అశ్విన్ కౌంటర్స్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి” అని  ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.  “ఇది ప్రభాస్/స్పిరిట్ ప్రభావంలా అనిపించడం లేదు, బహుశా ఇది వేరే ఏదైనా కావచ్చు.” అని మరొకరు పోస్ట్ పెట్టారు.

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రాజెక్ట్ నుంచి దీపిక నటి తప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో  సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లోనూ ప్రభాస్ హీరో. ఈ రెండు తెలుగు దర్శకులు తెరకెక్కిస్తున్నవే..రెండింటిలోనూ రెబల్ స్టార్ హీరో. 

ఇక  అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లో అయినా కొనసాగుతుందో లేదో అనే కొత్త చర్చ మొదలైంది.

అయితే ఇప్పటికే అట్లీతో జవాన్ మూవీలో దీపిక నటించారు కాబట్టి ఆల్రెడీ ఆమె కండిషన్స్ కి ఈ దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు. ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అయితే ఓకే...ఏదైనా కారణాలతో ఇది కూడా డ్రాప్ అనే మాటవినిపిస్తే దీపికా పదుకొనే తన కెరీర్ గురించి ఆలోచించాల్సిందే....

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget