Bianca Censori: గ్రామీ అవార్డులలో న్యూడ్ ఫోజులిచ్చిన బియాంకా ఎవరు? కాన్యే వెస్ట్ రెండో భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
Kanye West Wife Bianca Censori: గ్రామీ అవార్డులలో నగ్నంగా ఫోజులిచ్చిన బియాంకా పేరు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు? కాన్యే వెస్ట్ తో ఆమె లింక్ ఏంటో తెలుసా ?

మ్యూజిక్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు గ్రామీ అవార్డులు. ఈ ఈవెంట్లో కేవలం సంగీత ప్రపంచం మాత్రమే కాకుండా రెడ్ కార్పెట్ పై గ్లామర్ ఒలికించడానికి పలువురు స్టార్స్ దర్శనమిస్తూ ఉంటారు. కానీ కొంతమంది స్టార్స్ మాత్రం తమ వింత డ్రెస్సింగ్ తో జనాల దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటారు. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన వారిలో కాన్యే వెస్ట్ రెండో భార్య బియాంకా సెన్సోరి ఒకరు. మోడలింగ్ ప్రపంచంలో ఆమె ఓ పెద్ద సెన్సేషన్. కానీ గ్రామీ అవార్డుల్లో మరీ నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి, రాత్రికి రాత్రి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఇలా ఒక ఇంటర్నేషనల్ వేదికపై బట్టలు లేకుండా షో చేసిన ఈ బియాంకా సెన్సోరి ఎవరు? కాన్యే వెస్ట్ ని ఆమె ఎలా కలిసింది? అనే విషయాలపై ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు.
కాన్యే వెస్ట్ తో రెండో పెళ్లి...
అమెరికన్ ర్యాపర్. ప్రొడ్యూసర్ కాన్యే వెస్ట్ ను రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బియాంకా సెన్సోరి వార్తల్లో నిలుస్తోంది. ఆయన ముందుగా కిమ్ కర్దాషియాన్ ను పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత, కాన్యే కొంతకాలం ఆగి బియాంకను వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదని రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ మరోవైపు 2022లోనే కాలిఫోర్నియాలో ఈ జంట సీక్రెట్ గా మ్యారేజ్ లైసెన్స్ ని పొందారనే వార్తలు కూడా వినిపిస్తాయి.
అసలు ఈ బియాంక ఎవరు?
కాన్యే వెస్ట్ ను పెళ్లి చేసుకోక ముందు బియాంక ఎవరు అనేది ఎవరికీ తెలియదు. పెళ్లికి ముందు ఆమె ఆస్ట్రేలియాలో ఇంటీరియర్ డిజైనర్ గా పని చేసేది. ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని గమనిస్తే, బియాంక 'ఈజీ (yeezy) అనే కంపెనీలో ఆర్కిటెక్చర్ హెడ్ గా వర్క్ చేసేది. ఇక్కడే బియాంక, కాన్యే కలుసుకున్నారు. ఎందుకంటే ఆ ఈ కంపెనీ ఫౌండర్ కాన్యేనే కావడం వల్ల. అంతకంటే ముందు ఆమె 'కలెక్టివ్' అనే కంపెనీలో డిజైనర్ కన్సల్టెంట్ గా వర్క్ చేసింది.
బియాంక 2017 నుంచి 2000 వరకు 3 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాలోని DP టోస్కానో ఆర్కిటెక్ట్స్‌లో ఆర్కిటెక్ట్ స్టూడెంట్ గా పని చేశారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం, బియాంకా మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ డిగ్రీని పొందింది. ప్రస్తుతం బియాంక వయసు 30 ఏళ్లు. 2021 నవంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో బియాంక తను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో పెరిగానని వెల్లడించింది. చిన్నతనంలోనే క్రియేటివిటీ పై మంచి ఆసక్తి ఉండడంతో ఆమె శిల్పి కావాలని కోరుకునేదట. కానీ ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో టాప్ మోడల్ అని చెప్పొచ్చు. ఇక గ్రామీ అవార్డ్స్ 2025లో ఏకంగా వేసుకుందా లేదా అన్నట్టుగా... కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి, ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రపంచవ్యాప్తంగా బియాంక పేరు మార్మోగిపోవడం క్షణాల్లో జరిగాయి.
Also Read: 'తండేల్'తో పోటీ... 25 కుక్కలతో క్లైమాక్స్ షూట్... సాయి రామ్ శంకర్ క్లారిటీ





















